HBD Venu Thottempudi : 90స్ ఎవర్ గ్రీన్ హీరో వేణు తొట్టెంపూడి..

HBD Venu Thottempudi : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 90స్ లో స్టార్ హీరోలలో ఒకడిగా సత్తా చాటిన హీరో “వేణు తొట్టెంపూడి”. స్వయంవరం, చిరునవ్వతో, హనుమాన్ జంక్షన్, కల్యాణ రాముడు, చెప్పవే చిరుగాలి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులని అలరించిన ఈ హీరో 90స్ హీరోలలో లవ్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ప్రేమకథలతో, ఎంటర్టైన్మెంట్స్ మూవీస్ తో అలరించిన వేణు తొట్టెంపూడి. తన తోటిహీరోలైన శ్రీకాంత్, జగపతి బాబు వంటి హీరోలతో పలు మల్టి స్టారర్ చిత్రాలలోనూ నటించి మెప్పించాడు. అయితే 20స్ లో సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయిన వేణు, యంగ్ హీరోల రాకతో చల్ల బడ్డాడు. అయినప్పటికీ అడపా దడపా సినిమాలతో అలరిస్తున్నాడు. ఇక ఈరోజు (జూన్ 4) ఈ టాలెంటెడ్ హీరో పుట్టినరోజు. ఈ సందర్బంగా వేణు తొట్టెంపూడి (HBD Venu Thottempudi) కి ఫిల్మిఫై తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, వేణు గురించి మరికొన్ని విశేషాలని తెలుసుకుందాం.

HBD Venu Thottempudi Birthday Special

90స్ లో లవ్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరో..

ఇక ప్రకాశం జిల్లా కొండపి మండలం పేరిదేపి గ్రామంలో జన్మించిన తొట్టెంపూడి వేణు పెరిగింది మాత్రం ఒంగోలు, విజయవాడ, మదురై లో. వేణు తండ్రి కృష్ణమూర్తి ఇంగ్లీష్ లో లండన్ విశ్వవిద్యాలయం నుంచి పి.హెచ్.డి పూర్తి చేసారు. ఇక కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999 లో వచ్చిన “స్వయంవరం” అనే సినిమా తో పరిచయమైన వేణు తొలి సినిమాతోనే సక్సెస్ కొట్టాడు. ఈ సినిమాలో లయ హీరోయిన్ గా నటించగా ఆమెకు కూడా ఇదే తొలి సినిమా. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించగా, వేణు నటనకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘చిరునవ్వుతో’ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నాడు. ఇక హనుమాన్ జుంక్షన్, కళ్యాణ రాముడు, పెళ్ళాం ఊరెళితే, గోపి గోపిక గోదావరి వంటి పలు సినిమాల్లో నటించి కుటుంబ ప్రేక్షకులను అలరించారు. ఇక వేణు కథానాయకుడిగానే కాకుండా సహాయనటుడిగా, నిర్మాతగా, మాటల రచయిత గా కూడా పలు చిత్రాలకు పనిచేశాడు.

- Advertisement -

బిజినెస్ లో రాణిస్తున్న వేణు..

ఇక వేణు 20స్ తర్వాత వరుస పరాజయాలతో సినిమాలు తగ్గించగా, 2013 లో రామాచారి అనే చిత్రంలో నటించాడు. ఆ సినిమా తరువాత బిజినెస్ రంగంలోకి ప్రవేశించి ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. ఇక 9 ఏళ్ళ తర్వాత 2022 లో రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన రామారావు అనే చిత్రంలో నటించాడు. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ కావడంతో మళ్ళీ సినిమాల జోలికి రాలేదు. ఇక వేణు భార్య అనుపమ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి యం.బి.ఏ పూర్తి చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. పెద్ద కంపెనీల్లో ఉద్యోగాల్లో చేరమని ఆహ్వానించినా కుటుంబ బాధ్యతలకే తన ప్రాధాన్యత ఇస్తున్నారు వేణు. ఇక సొంత చిత్ర నిర్మాణ సంస్థ ఎస్.పి ఎంటర్టైన్మెంట్స్ కు మార్కెట్ హెడ్ గా పనిచేశారు. వేణు. అయితే 90స్ లో స్టార్ గా ఓ వెలుగువెలిగిన వేణు ఇప్పటి స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వస్తున్నా పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదట. కానీ మళ్ళీ వేణు సినిమాల్లో నటిస్తే చూడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు