Kalki 2898 AD Second Trailer : ‘కల్కి’ యాక్షన్ ట్రైలర్ వచ్చేసింది… ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Kalki 2898 AD Second Trailer : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా ‘కల్కి’.. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఈ సినిమా నుంచి గతంలో వచ్చిన ట్రైలర్ విజువల్ వండర్ ను క్రియేట్ చేసింది.. అద్భుతమైన సన్నివేశాలను, భారీ యాక్షన్ సన్నివేశాలను ట్రైలర్ లో చూపించారు.. ఇప్పుడు తాజాగా మరో ట్రైలర్ ను విడుదల చేశారు.. మొదటి ట్రైలర్ సినిమా అంచనాలను పెంచితే.. సెకండ్ ట్రైలర్ మాత్రం అంతకు మించి ఉంది.. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది.

భారీ బడ్జెట్ తో భారీ యాక్షన్ సన్నీవేశాలతో తెరకేక్కిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి బయటకు వచ్చిన టీజర్స్, ట్రైలర్ కు జనాల నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. తాజాగా మేకర్స్ సెకండ్ ట్రైలర్ ను వదిలారు.. ట్రైలర్ మొదలుకొని ఒక్కో యాక్షన్ సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.. అమితాబ్, మృణాల్ కు సంబందించిన కొన్ని అద్భుతమైన సీన్లు హైలెట్ గా నిలిచాయి. విజువల్స్ మాత్రం ఓ రేంజులో ఉన్నాయి.. డైరెక్టర్ కష్టం ఇందులో కనిపిస్తుంది.. ట్రైలర్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే భారీ వ్యూస్ లైకులతో దుమ్ము దులిపేస్తుంది ఈ ట్రైలర్.

- Advertisement -

ఈ సెకండ్ ట్రైలర్ లో డైరెక్టర్ నాగి యాక్షన్ సీన్స్ కు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిసిపోతుంది. అలాగే కాశీ, కాంప్లెక్స్, శంభళ నగరాల గురించి ఇంకాస్త వివరించే ప్రయత్నం చేశారు. మొత్తంగా ఈ ట్రైలర్ ఈ నెల 27న రిలీజ్ కాబోయే సినిమాపై అంచనాలను పెంచేలా ఉందని చెప్పొచ్చు. అలాగే ఈ ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ లను తుడిచిపెట్టే ఛాన్స్ కూడా ఉంది.. మొత్తంగా చూసుకుంటే సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని ఫ్యాన్స్ సంబరాలు మొదలెట్టేశారు.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, శోభన, మృణాల్ ఠాకూర్, పశుపతి, అన్నా బెన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉంది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ ఇచ్చారు..

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు