Spy: పాన్ ఇండియా మూవీతో డెబ్యూ. హిట్టయితే ?

ఐశ్వర్య మీనన్. చెన్నై కి చెందిన ఈ బ్యూటీ కోలీవుడ్ లో చిన్న సినిమాల్లో స్టార్ హీరోయిన్. 2012 లో “కాదలిల్ సోదప్పువదు యెప్పడి” మూవీ లో సైడ్ రోల్ ద్వారా తమిళ ఇండస్ట్రీ లో అడుగుపెట్టింది ఈ హీరోయిన్. ఆ చిత్రం తెలుగులో “లవ్ ఫెయిల్యూర్” పేరుతో విడుదలైంది. ఆ తర్వాత “ఆపిల్ పెన్నె” మూవీతో హీరోయిన్ గా కెరీర్ ఆరంభించగా కన్నడలో చేసిన “దసవల” చిత్రం తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే తమిళం లో వరుసగా సినిమాలు చేస్తున్నా ఈ అమ్మడికి హిట్లు రావడం లేదు. తన లాస్ట్ మూవీ “వెజాం” కూడా ప్లాప్ అయింది. ఈ సంవత్సరం ఐశ్వర్య ఏ సినిమాలోనూ నటించలేదు.

అయితే ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్ నుంచి లక్ తగిలింది. తెలుగులో నిఖిల్ నటిస్తున్న “స్పై” సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఐశ్వర్య మీనన్ కి ఫస్ట్ తెలుగు మూవీ.

అయితే ఈ సినిమా ఐశ్వర్య కి దొరికిన ఒక గోల్డెన్ ఛాన్స్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే “స్పై” సినిమా పాన్ ఇండియా మూవీ గా ఐదు భాషల్లో తెరకెక్కుతుంది. ఈ మూవీ హిట్ అయితే ఐశ్వర్య మీనన్ ఇండియా మొత్తం ఫేమస్ కావచ్చు. అప్పుడు తెలుగుతో పాటు ఇతర భాషాల్లో కూడా ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేస్తుంది కూడా ఈ ఒక్క సినిమాయే. కాబట్టి స్పై మూవీపై బాగానే ఆశలు పెట్టుకుంది. మరి తమిళంలో సక్సెస్ కాలేకపోయిన ఈ హీరోయిన్ తెలుగులో అయినా హిట్టు కొట్టి సక్సెస్ అవుతుందా? తెలుగులో ఇంకా ఆఫర్లు వస్తాయా లేదా అన్నది చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు