Hebah patel: మరోసారి పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హెబ్బా పటేల్..!

Hebah patel: అలా ఎలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హెబ్బా పటేల్.. కుమారి 21ఎఫ్ లో బోల్డ్ రోల్ లో నటించి అదరగొట్టేసింది.. ముఖ్యంగా ఈమె అందానికి ఫిదా అవడమే కాదు ఈమె నటనకు యువత దాసోహం అయ్యారు.. ఎంతోమంది అబ్బాయిలకు కలల రాకుమారిగా నిలిచిపోయింది హెబ్బా పటేల్.. ముఖ్యంగా ఈమె కెరియర్ లోనే కుమారి 21ఎఫ్ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పవచ్చు. ఇక ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా చేసింది కానీ ఈ సినిమా భారీ స్థాయిలో డిజాస్టర్ గా నిలిచింది.. అంతేకాదు ఈ సినిమాతో ఈమె కెరియర్ డౌన్ ఫాలో అవ్వడం మొదలుపెట్టింది. తర్వాత రామ్ నటించిన రెడ్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది హెబ్బా పటేల్. తర్వాత ఆ తర్వాత కొంతకాలం తెలుగు సినీ పరిశ్రమకు దూరమైన ఈమె నేరుగా ఓదెలా రైల్వే స్టేషన్ అనే సినిమాతో డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసింది .. ఈ సినిమాలో చాకలి అమ్మాయి పాత్రలో నటించి అదరగొట్టేసిందని చెప్పవచ్చు.. అంతేకాదు సినిమాకే ప్రాణం పోసిన ఈమె ఈ సినిమాతో మంచి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాకి సీక్వెల్ కూడా రాబోతున్న విషయం తెలిసిందే.. ఓదెల 2 పేరిట వస్తున్న సినిమాలో తమన్నా తో పాటు హెబ్బా పటేల్ కూడా నటిస్తున్నారు.

హనీమూన్ ఎక్స్ప్రెస్..

ఇదిలా ఉండగా తాజాగా ఈమె నటించిన చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్.. చైతన్య రావ్ హీరోగా హెబ్బా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం హనీమూన్ ఎక్స్ప్రెస్.. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు .. ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీగా దర్శకుడు బాల శేఖరుని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 21వ తారీకున ప్రపంచ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర టీజర్ ను ఇటీవలే అమల అక్కినేని అమల విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఫన్నీగా, రొమాంటిక్గా అనిపించింది.. ఈ రోజు సమాజంలోని రొమాంటిక్ , వివాహ బంధాలను గురించి ఒక బలమైన కథను చూపించారు అని టీజర్ చూస్తే అర్థమవుతుంది.. జూన్ 21న విడుదల కాబోయే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

పెళ్లిపై మరోసారి క్లారిటీ ఇచ్చిన హెబ్బా పటేల్..

Hebah Patel: Once again Hebah Patel made shocking comments on marriage..!
Hebah Patel: Once again Hebah Patel made shocking comments on marriage..!

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ ను శరవేగంగా చేపడుతున్నారు.. అందులో భాగంగానే ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. రెండవసారి తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది.. హెబ్బా పటేల్ మాట్లాడుతూ.. ప్రేమ అంటే నమ్మకం ఉంది.. కానీ పెళ్లి పై నమ్మకం లేదు అని క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.. అయితే ప్రస్తుతం సమాజంలో అందరూ పెళ్లిళ్లు చేసుకుని సంతోషంగా లేరా? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి ? అని అడగ్గా.. అందరూ అలా అని చెప్పలేదు.. నా వ్యక్తిగత విషయాన్ని మాత్రమే చెబుతున్నాను.. పెళ్లి పై నాకు నమ్మకం లేదు.. ఒకవేళ నాకు నచ్చిన వ్యక్తి.. అన్ని విధాల నా ఆలోచనలకు తగిన వ్యక్తి కనిపిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో నా ఆలోచన మారి పెళ్లి చేసుకుంటానేమో తెలియదు.. ప్రస్తుతానికైతే సింగిల్ గా ఉండడమే నాకు ఇష్టం అంటూ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికైతే హెబ్బా పటేల్ చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు