Hebah Patel : అబ్బా అనిపిస్తున్న హెబ్బ అందాలు… చీరలో కూడా కెవ్వు కేక

Hebah Patel: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హెబ్బా పటేల్ పుట్టి పెరిగింది ముంబైలోనే. మొదటగా ఓ డ్యాన్సర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. హెబ్బా పటేల్ కెరీర్ ప్రారంభమైంది మొదటగా కన్నడ ఇండస్ట్రీలోనే. 2014 సంవత్సరంలో కన్నడ సినీ పరిశ్రమకు అధ్యక్ష అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమాతో కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుసగా మూడు సినిమాలు చేసి మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2015 సంవత్సరంలో కుమారి 21ఎఫ్ అనే సినిమాతో మన అందరి ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హీరోయిన్గా నటించింది. ఆ సినిమాలో కుమారి పాత్రలో హెబ్బా పటేల్ చాలా హాట్ అండ్ బోల్డ్ సీన్లలో మెరిసింది ఈ బ్యూటీ. ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హెబ్బా పటేల్ కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈడోరకం ఆడోరకం, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అందగాడు, మిస్టర్, ఒరేయ్ బుజ్జిగా లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ.

Image

- Advertisement -

అయితే ఈ మధ్యకాలంలో ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాలో ఒక అద్భుతమైన పాత్రలో నటించింది హెబ్బా. ఈ సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా తన కెరీర్ కు ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమాకు సంబంధించి రెండవ భాగం కూడా త్వరలోనే మన అందరి ముందుకి రానుందని సమాచారం. అలాగే హెబ్బా పటేల్ గత సంవత్సరంలో వ్యవస్థ అనే వెబ్ సిరీస్ తో కూడా ఆకట్టుకుంది. ఈ సిరీస్ ఇప్పటికీ కూడా మంచి టాక్ తెచ్చుకుంటుంది.

Hebah Patel: చీరకట్టులో హెబ్బా.. అబ్బా అనిపిస్తుందిగా.. హనీమూన్ అంటూ అలాంటి ఫోటో షేర్ చేసిందేంటి! – News18 తెలుగు
ఇదిలా ఉండగా…..ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎప్పుడూ అభిమానులకు చేరువలో ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ అండ్ క్యూట్ ఫోటోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ యూత్ ను ఆకట్టుకుంటూ ఉంటుంది.

Image

ఈ క్రమంలోనే తాజాగా హెబ్బా పటేల్ సారీలో మెరిసింది. ఎల్లో కలర్ సారీ కట్టుకొని తన యద అందాలను చూపిస్తూ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన హెబ్బా అభిమానులు చాలా అందంగా హాట్ గా ఉన్నావంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.

 

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు