Hema: నేను తప్పు చేయలేదు….మా పవన్ కళ్యాణ్ దగ్గరే నిరూపించుకుంటా….!

 

Hema: బెంగుళూరు రేవ్ పార్టీలో ఇటీవలే ప్రముఖ నటి హేమ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే నటి హేమని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు రిమాండ్ కి తరలించారు. అనంతరం ఆమె బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ముక్కుసూటి మనుషులు ఎప్పుడూ కూడా తప్పు చేయరని…. తాను ఎలాంటి తప్పు చేయలేదని హేమ అంటుంది. అసలు తాను బెంగుళూరు రేవ్ పార్టీకే వెళ్లలేదని….బర్త్డే పార్టీకి మాత్రమే వెళ్లానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెబుతోంది. నేను పక్కా కాపు అని.. పవన్‌ కళ్యణ్‌ గెలిచిన ఆనందాన్ని కూడా నాకు మిగిలించలేదు ఈ మీడియా…ఆ డ్రగ్స్ కేసులో నన్ను ఇరికించారన్నారు.

మా పవన్‌ కళ్యణ్‌ ముందే నిరూపించుకుంటాను కావాలంటే నేను ఎలాంటి తప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు రేవ్ పార్టీ ఆదివారం జరిగిందని…. తాను శనివారం రోజు బర్త్డే పార్టీకి వెళ్లి వచ్చేసానని… నేను శాంపిల్స్ కూడా ఇవ్వకుండానే పాజిటివ్ వచ్చాయని….నాపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని…. తన ఇష్యూలో మీడియానే తప్పుడు ప్రచారం చేసిందని హేమ అంటోంది. అంతేకాకుండా హేమ…. బ్రేకింగ్ న్యూస్…. బ్రేకింగ్ న్యూస్…. హేమ ఇది చేసింది…. హేమ అది చేసింది అని ఒకటే బ్రేకింగ్ టీవీలలో. నేనేమైనా టెర్రరిస్టునా? ఎంతమందిని చంపేశాను. బెల్డ్ బాంబులు ఏమైనా పెట్టుకొని వెళ్లానా? గతంలో పూరి గారు కూడా డ్రగ్స్ కేసులో ఉన్నప్పుడు ఆయనకి ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదు కదా…. ఆయన పేరు తీసినందుకు నన్ను క్షమించండి.

- Advertisement -

ఆయనకి ఎవరు రాలేదు కానీ….నాకు నాతో ఉన్న ఆ ఇద్దరు హీరోలు నా కూతురిని పంపించారని తెలిపారు. నాకు ఏం కావాలో దగ్గరుండి చూసుకున్నారు. మంచు విష్ణు కూడా నాకు చాలా సపోర్ట్ గా ఉన్నారు. నన్ను ఎవరూ వదల్లేదు. నా ఫ్రెండ్స్ అందరూ నాతోనే ఉన్నారు. నేనేమైనా బల్డ్ బాంబ్ పెట్టుకొని ఓ లక్ష మందిని చంపానా? నేనేమైనా టెర్రరిస్టునా? నేను వెళ్ళింది కేవలం బర్త్డే పార్టీకి మాత్రమే అని తెలిపారు.

 

నా తమ్ముడి లాంటి వాడితో కలిసి వెళ్లాను. రేపు తీర్పు వచ్చినప్పుడు అందరికీ తెలుస్తోంది. నేను పార్టీకి వెళ్లానా? లేదా? డ్రగ్స్ తీసుకున్నానా? లేదా? అనేది. నేను అన్ని టెస్టులు చేయించుకున్న, అన్ని నెగిటివ్ వచ్చాయి. అవన్నీ మా అసోసియేషన్ కి వచ్చాయి. వాళ్లంతా నేను తప్పు చేయను అని నమ్మి నాకు “మా” కార్డు తిరిగి ఇచ్చేశారు. 35 ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్న నాపై ఒక్క రిమార్క్ కూడా లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటి హేమ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు