Hema Drugs Case : హేమ విషయంలో మంచు విష్ణు యూటర్న్… ‘మా’ వాట్సప్ గ్రూప్‌లో బిగ్ డిసీషన్ తీసుకుంటూ మెసేజ్..!

Hema Drugs Case.. ప్రముఖ సినీ నటి హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే.. అయితే ఇటీవల ఈమెను పోలీసులు అరెస్టు కూడా చేశారు.. ఇక ఈ విషయంపై సర్వత్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.. ఈ క్రమంలోనే మా సభ్యురాలిగా ఉన్న హేమాను సస్పెండ్ చేస్తున్నట్లు తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి

మా అసోసియేషన్ నుంచి హేమా సస్పెండ్..

Hema Drugs Case: Manchu Vishnu Uturn in Hema case... taking big decision message in 'Ma' WhatsApp group..!
Hema Drugs Case: Manchu Vishnu Uturn in Hema case… taking big decision message in ‘Ma’ WhatsApp group..!

అసలు విషయంలోకి వెళితే.. హేమాను సపోర్టు చేస్తూ మా అధ్యక్షుడు మంచు విష్ణు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.. అయితే ఇప్పుడు మా సభ్యుల నిర్ణయం మేరకు హేమాను సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.. తాజాగా “మా అసోసియేషన్” గ్రూపులో.. హేమా డ్రగ్స్ తీసుకుందని రుజువయ్యింది. ఆమెను సస్పెండ్ చేయడానికి మీ అభిప్రాయాలు ఏంటి? అని విష్ణు అడిగగా.. సస్పెండ్ చేయాల్సిందే అంటూ విష్ణుకి రిప్లై ఇచ్చారట.. మొన్న సపోర్ట్ చేస్తూ హేమా గురించి మాట్లాడిన మంచు విష్ణు.. ఈ రోజు హేమా అరెస్టు కావడంతో ఇలా “మా ” సభ్యుల అభిప్రాయాలను” మా అసోసియేషన్ గ్రూపు” ద్వారా తెలుసుకున్నట్లు తెలుస్తోంది.. ఇక అందరూ సస్పెండ్ చేయాలని కోరడంతో తదుపరి క్లీన్ చిట్ వచ్చేంత వరకు హేమాని సస్పెండ్ చేయనున్నారు మా అధ్యక్షుడు విష్ణు.. ఇక ఈ విషయంపై రేపు మధ్యాహ్నం పూర్తి క్లారిటీ రానుంది..

డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్..

మరోవైపు నటి హేమా డ్రగ్స్ తీసుకున్నట్టు రక్త నమూనాలో వెలువడగా.. ఈమెను విచారణకు హాజరు కావాలని సీసీబీ మొదటిసారి హేమాకు నోటీసులు పంపించింది.. వైరల్ ఫీవర్ కారణంగా తాను రాలేనని చెప్పింది.. ఇక మరోసారి నోటీసులు కూడా వచ్చాయి.. దీంతో నిన్న బెంగళూరు పోలీసుల ముందు విచారణకు హాజరు కాగా.. ఆమెను అరెస్టు చేశారు.. అంతేకాదు 14 రోజులపాటు కోర్టు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.. బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడల్స్ పట్టుబడిన విషయం తెలిసిందే.

- Advertisement -

అరెస్ట్ అయిన ఏడుగురిలో హేమా కూడా..

ఇదే పార్టీకి వచ్చిన ఒక కారులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన స్టిక్కర్ కూడా దొరికింది.. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు కూడా గుర్తించారు.. ఇందులో 86 మంది మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని.. నగర నేర నియంత్రణ దళం ( సీసిబి)అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళలు 27 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అందరికీ డ్రగ్ పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మరోవైపు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన ఆరుగురు నిందితులతో పాటు సినీనటి హేమ కూడా విచారణకు హాజరుకావాలని సిసిబి పోలీసులు నోటీసులు జారీ చేస్తే వైరల్ ఫీవర్ అని తప్పించుకుంది. అంతేకాదు బెంగళూరు పోలీసులకు వైరల్ ఫీవర్ కారణంగా విచారణకు హాజరుకాలేనని కూడా లేఖ రాసింది.. అయితే హేమా అభ్యర్థనను సిసిబి పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు.. విచారణకు హాజరు కాకపోవడంతో హేమాకు కొత్తగా నోటీసులు పంపి ఆమెను అరెస్టు చేశారు. దీంతో కోర్టు ఈమెకు 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. ఈమెకు మరొక షాక్ ఇస్తూ ఇప్పుడు మా సభ్యత్వాన్ని కూడా సస్పెండ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు