Hema: రెండ్రోజుల్లో అందరి లెక్కలు తేలుస్తా.. హేమ ఘాటు వ్యాఖ్యలు..!

Hema.. ప్రముఖ సీనియర్ నటి హేమ ఈ మధ్యకాలంలో భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా గత రెండు మూడు రోజులుగా ఈమె చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బెంగళూరు రేవు పార్టీలో ఈమె కనిపించడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పవచ్చు.. ఇకపోతే తాజాగా ఈ వ్యవహారం పైన స్పందించింది ..నిజానికి బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు వార్తలు వచ్చిన కొద్దిసేపటికే.. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ ఒక వీడియోని కూడా రిలీజ్ చేసింది.. అది చూసిన బెంగళూరు పోలీసులు ఆమె తప్పుదోవ పట్టిస్తోంది అంటూ.. ఆమె బెంగళూరులోనే ఉన్నట్లు కొన్ని ఫోటోలు, వీడియోలను కూడా రిలీజ్ చేశారు.. అంతేకాదు రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలను కూడా బయట పెట్టడం జరిగింది.

అడ్డంగా బుక్ అయిన హేమ..

దీంతో ఈమె అడ్డంగా బుక్ అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇంత జరుగుతున్న సమయంలో ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో బిర్యానీ వండుతున్న వీడియోని షేర్ చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ విషయంపై స్పందించిన ఆమె ఈ పార్టీ గురించి అన్ని విషయాలు చెబుతానని చెప్పుకొచ్చింది..

రెండు రోజుల్లో అందరి సంగతి తేలుస్తా..

Hema: Everyone's calculations will be settled in two days.. Hema's harsh comments..!
Hema: Everyone’s calculations will be settled in two days.. Hema’s harsh comments..!

హేమా మాట్లాడుతూ.. నేను ఏ తప్పు చేయలేదు.. ఇప్పటికే అందరికీ క్లారిటీ ఇచ్చాను.. ఇప్పుడు నేను హైదరాబాదులోనే ఉన్నాను.. కానీ బెంగళూరులో ఉన్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారు.. ప్రస్తుతానికి నాకు కొంచెం స్పేస్ కావాలి .. ఒకటి రెండు రోజుల్లో నేనే స్వయంగా మీడియా ముందుకు వచ్చి అందరి సంగతి చెబుతా.. భయంతో నేను పారిపోయేదాన్ని కాదు.. ఒకవేళ అలా పారిపోయేదాన్ని అయితే.. ఈ రెండు మూడు రోజుల్లో వచ్చిన దాదాపు 500 ఫోన్ కాల్స్ ని నేను అటెండ్ చేసే దాన్ని కాదు.. ముఖ్యంగా మీడియా వాళ్లతో మాట్లాడేదాన్ని కూడా కాదు .. ఇది ఎందుకు వచ్చిందో? ఎలా వచ్చిందో ?దీని వెనుక ఎవడున్నాడో? ఎవరు చేయిస్తున్నారో? కూడా నాకు తెలుసు.. అన్నీ త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాను అంటూ కామెంట్లు చేసింది హేమ .. ప్రస్తుతం హేమ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

- Advertisement -

అసలు జరిగింది ఇదే..

ఇక అసలు విషయంలోకి వెళితే బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జి ఆర్ ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరిట రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే..అయితే ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులకు సమాచారం లభించడంతో.. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో ఉన్న పోలీసులతోపాటు నార్కోటిక్ అధికారులు కూడా దాడి చేశారు.. దీంతో అక్కడ మత్తు పదార్థాలతో పాటు కొకైన్ కూడా లభ్యం అయిందని.. ఇక్కడ 25 మందికి పైగా యువతులు ఉన్నట్లు పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు .. అందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం.. దీంతో హేమా కూడా అక్కడ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారించారు .. కానీ ఆమె పోలీసులనే తప్పుదోవ పట్టిస్తూ వీడియో రిలీజ్ చేసింది.. ఇప్పుడు పోలీసులు ఆధారాలతో నిరూపించడం పైగా ఆమె మరొక వీడియో చేయడం అన్ని ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో.. త్వరలోనే అందరి సంగతి తేలుస్తా అంటూ చెప్పుకొచ్చింది హేమ.. మరి మరో రెండు రోజుల్లో ఆమె ఏం చెబుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు