Hema Drugs Case : నన్ను రక్షించాల్సిన బాధ్యత ‘మా’ దే… విష్ణుకి ఇచ్చిన లెటర్‌లో హేమ

Hema Drugs Case : టాలీవుడ్ క్యారక్టర్ ఆర్టిస్ట్ హేమ పేరు ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది.. మొన్నామధ్య బెంగుళూరు రేవ్ పార్టీలో ఆమె ఉన్నట్లు వార్తలు వినిపించాయి.. ఆమె రక్త నమూనాలు టెస్ట్ చేస్తే డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందని పోలీసులు తెలిపారు.. కానీ హేమ మాత్రం నేను ఏ పార్టీకి వెళ్లలేదు.. డ్రగ్స్ తీసుకోలేదని వాదించిన ఎవరు పట్టించుకోలేదు.. రిమాండ్ కు వెళ్లింది కూడా.. చివరికి ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చింది.. తాజాగా ఈ కేసు నుంచి హేమకు ఊరట కలిగినట్లు తెలుస్తుంది..

నటి హేమ మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) అధ్యక్షుడు మంచు విష్ణును కలిశారు.. ‘మా’ నుంచి తొలగించడం అన్యాయమని, తిరిగి సభ్యత్వం కల్పించాలని బహిరంగ లేఖ రాశారు.. ఆ లేఖలో ఆమె ప్రత్యేకమైన ల్యాబ్ లో టేస్ట్ లు చేయించుకున్నట్లు పేర్కొంది.. అలాగే వాటిలో నేను డ్రగ్స్‌ తీసుకోలేదని స్పష్టమైంది. త్వరలోనే పోలీసులు చేసిన పరీక్షల్లోనూ ఇవే రిజల్ట్స్ వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఈలోపే నన్ను దోషిగా భావించి ‘మా’ సభ్యత్వం రద్దు చేయడం సరైంది కాదని భావిస్తున్నాను దయచేసి నాకు మా అండగా ఉండాలని నేను కోరుకుంటున్నా అని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.

Hema Manchu Vishnu
Hema Manchu Vishnu

‘మా’ బైలాస్ ప్రకారం ఎవర్నైనా సస్పెండ్ చేయాలంటే వారికి షోకాజ్ నోటీసు ఇవ్వాలి, వివరణ అడగాలి. కానీ నాకు ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయలేదు. నాపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ‘దోషిగా తేలే వరకు అందరు నిర్దోషులే..’మీరు చేసిన ట్వీట్ నాకు బాగానే అనిపించింది అంటూ పేర్కొంది.. మరి మా అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని ఇస్తారో లేదో చూడాలి.. ఏదేమైనా ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇక బెయిల్ పై బయటకు వచ్చిన తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.. అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవ్వడం మనం చూసే ఉన్నాం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు