Hema: హేమ మెంబర్షిప్ నిషేధాన్ని ఎత్తివేసిన “మా” అసోసియేషన్, హేమ ఎమోషనల్ వీడియో

Hema: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ నటీమణిలలో హేమ ఒకరు. ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపును సాధించుకుంది హేమ. చాలామంది స్టార్ హీరోస్ సినిమాలో కూడా కనిపించింది. హేమకు సినిమాలతో ఎంత గుర్తింపు వచ్చిందో వివాదాలతో కూడా అంతే గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. హేమ నిజంగానే అలా ఉంటారో లేకపోతే ఆమె ముక్కుసూటి తనం వలన అలా అనిపిస్తారో తెలియదు కానీ, చాలామంది హేమ కు నెగిటివ్ మాట్లాడేవారు ఇండస్ట్రీలో ఎక్కువ శాతం మంది ఉన్నారు.

రీసెంట్ టైమ్స్ లో బెంగళూరు రేవ్ పార్టీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో రేవ్ పార్టీ గురించి వార్తలు వైరల్ గా మారాయి. ఈ రేవ్ పార్టీలో చాలామంది తెలుగు సినీ ప్రముఖులు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిలో సీనియర్ నటులు శ్రీకాంత్, హేమ పేర్లు కూడా బయటకు వచ్చాయి. అలానే కొరియోగ్రాఫర్ జానీ పేరు కూడా బయటకు వచ్చింది. అయితే ఈ విషయాలు ఏవి వాస్తవాలు కాదు అంటూ స్వయంగా శ్రీకాంత్, హేమ, జానీ మాస్టర్ వీడియోలు రిలీజ్ చేసారు. అయితే వీటిలో శ్రీకాంత్, జానీ ఆ పార్టీలో ఇన్వాల్వ్ కాలేదని ఒక క్లారిటీ ఉంది. కానీ హేమా విషయంలో సరైన క్లారిటీ లేదు. అందుకనే హేమాను పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ కూడా జరిపారు. విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

హేమ ఎమోషనల్ వీడియో

ఇక హేమ రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తరుణంలో హేమ ఒక వీడియోను చేశారు. వీడియోలో అనేక అంశాలను ప్రస్తావించింది హేమ. ‘‘కొన్ని నెలలుగా నాపై మీడియాలో చాలా రకాల వార్తలు పుట్టుకొచ్చాయి. దాని వల్ల 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే. నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. మొత్తం నా జుట్టు, గోళ్లు, బ్లడ్‌ అన్నీ ఇచ్చి టెస్ట్‌ చేయించుకున్నాను. ఇందులో నాకు నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. ఇదే విషయాన్ని నేను ఛానల్స్‌‌కు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఒక్కటే నేను ఎలాంటి టెస్టులకైనా బహిరంగంగా రెడీ, అని మీ ముందు చెప్పడానికి వచ్చాను. అలాగే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి (Telangan CM Revanth Reddy), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) అపాయింట్‌మెంట్‌ అడగటానికి ఈ వీడియో చేశాను. ఈ వీడియో వారికి చేరుతుందని నమ్ముతున్నా’’ అని తెలుపుతూ.. తను చేయించుకున్న టెస్ట్‌లకు సంబంధించిన రిపోర్ట్స్‌ని వీడియోలో షేర్ చేసింది.

- Advertisement -

Hema

ఇక ఆమెపై నిషేధం విధిస్తూ.. ‘మా’ (MAA) నిర్ణయం తీసుకుంది. హేమ విచారణలో నిజంగా తప్పు చేసినట్లు తెలిస్తే.. ‘మా’ ఆమెను బ్యాన్ చేస్తుందని అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించి.. ఆ వెంటనే ఆమెపై బ్యాన్ విధించారు. తాజాగా ఆమెపై ‘మా’ నిషేధం ఎత్తివేసినట్లుగా అధికారికంగా ప్రకటించింది. తనపై నిషేధం ఎత్తివేయడంతో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు హేమ ధన్యవాదాలు తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు