Hema: నటి హేమను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hema: రీసెంట్ గా బెంగళూరులో రేవ్ పార్టీ జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పార్టీ గురించి సోషల్ మీడియా వేదికగా విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ పార్టీకి చాలామంది తెలుగు సినిమాకి సంబంధించిన సెలబ్రిటీలు హాజరయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా కన్నడ మీడియా నుంచి కూడా కొన్ని వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆదివారం జరిగిన ఈ పార్టీకి యాంకర్ శ్యామల, నటి హేమ వంటి పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నటి హేమ నేను హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ ఒక వీడియోతో క్లారిటీ ఇచ్చారు. యాదృచ్ఛికంగా తను ఏ డ్రెస్ తో అయితే వీడియో రిలీజ్ చేశార. అదే డ్రెస్ తో బెంగళూరు పోలీసులు ఫోటోను విడుదల చేసారు. ఇకపోతే ఈ పార్టీలో శ్రీకాంత్ జానీ మాస్టర్ పేర్లు కూడా బయటకు వచ్చాయి అయితే వారిద్దరూ వీడియోతో సరైన క్లారిటీ ఇచ్చారు.

Telugu actress Hema arrested
పోలీసులు అదుపులో హేమ

ఇకపోతే ఎన్ని విధాలుగా తప్పించుకునే ప్రయత్నం చేసిన కూడా ఆ రేవు పార్టీలో హేమ ఉన్నారని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. డ్రగ్స్ టెస్ట్ లో కూడా ఆమెకి పాజిటివ్ వచ్చింది. ఈ రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటి హేమను బెంగళూరు సీసీబీ పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. డ్రగ్స్ టెస్టులో ఆమెకు పాజిటివ్ రాగా, విచారణకు రావాలని కొన్ని రోజుల క్రితం నోటీసులు ఇచ్చారు. ఆమె హాజరుకాకపోవడంతో నేడు అదుపులోకి తీసుకున్నారు. రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. గత నెల 20న హేమ బెంగళూరులో రేవ్ పార్టీలో పాల్గొన్నారు. అందులో 86 మంది మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు