Hema Released from Jail : రేవ్ పార్టీ కేసులో జైలు నుంచి విడుదలైన హేమ

Hema Released from Jail : ఇటీవల కాలంలో బెంగళూరు రేవు పార్టీ సంచలనగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటి హేమ పేరు ఎక్కువగా వినిపించింది. ఆ తర్వాత పోలీసులు ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా హేమ ఈ కేసులో జైలు నుంచి విడుదలైంది. రేవ్ పార్టీ నిర్వహణలో హేమ కీలక పాత్ర పోషించింది, పార్టీలో డ్రగ్స్ వాడింది అంటూ పోలీసులు ఆమెపై చార్జ్ షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు పై బెంగళూరు కోర్టు విచారణ చేపట్టింది.

BREAKING: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం.. జైలు నుంచి నటి హేమ విడుదల

అయితే హేమ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనలు బలంగా వినిపించారు. అందులో భాగంగానే హేమ నుంచి పోలీసులు ఎలాంటి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోలేదని లాయర్ వాదించారు. అయితే ఆరోజు రాత్రి రేపు పార్టీలో హేమ పాల్గొన్న సాక్ష్యాలను బెంగళూరు పోలీసులు కోర్టుకు అందజేయగా, ఇరుపక్షాల వాదోపవాదనలు విన్న ధర్మాసనం హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అరెస్ట్ అయ్యాక జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న హేమను పరప్పన అగ్రహారం జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్ మంజూరు అయిన నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలైంది.

- Advertisement -

షరతులతో కూడిన బెయిల్

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో జూన్ 3న అరెస్టయిన తెలుగు నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ స్వాధీనం చేసుకోలేదని హేమ తరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించడంతో ఎన్‌డిపిఎస్ ప్రత్యేక కోర్టు బెయిల్‌ను ఆమోదించింది. అరెస్టు చేసిన చాలా రోజుల తర్వాత హేమకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు శెట్టి పేర్కొన్నారు. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశించింది.

హేమ ఎలా అరెస్ట్ అయ్యిందంటే?

పోలీసులు హేమాపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం మే 19 న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఒక ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు ప్రముఖులు డ్రగ్స్ సేవించినట్లు పేర్కొన్నారు. ఇక ఈ కేసులో డ్రగ్ టెస్ట్ చేసిన 27 మంది మహిళల్లో హేమ కూడా ఉన్నారు. కేంద్ర క్రైమ్ బ్రాంచ్ (సిసిబి) పక్కా సమాచారం ఆధారంగా ఫామ్‌హౌస్‌పై దాడి చేసి హాజరైన వారి నుండి రక్త నమూనాలను సేకరించింది. పుట్టినరోజు వేడుకల పేరుతో రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.

సమాచారం ప్రకారం ఈ పార్టీకి 73 మంది పురుషులు, 30 మంది మహిళలు హాజరయ్యారని ఎఫ్‌ఐఆర్ లో వారి పేర్లతో సహ రాశారు పోలిస్ అధికారులు. మొత్తం 59 మంది రక్త నమూనాలను పరీక్షించగా, అందులో 27 మంది మహిళల రక్త నమూనాలు పాజిటివ్‌గా తేలింది. మొత్తంమీద 103 మందిలో 86 మంది మాదకద్రవ్యాలు తీసుకున్నట్టు తేలింది. అయితే తన పేరును అనవసరంగా లాగారని, ఆ సమయంలో తాను హైదరాబాద్ శివార్లలోని ఫామ్‌ హౌస్‌లో ఉన్నానని హేమ సోషల్ మీడియాలో వీడియోలో పేర్కొంది. ఆ తరువాత హేమను నోటీసులిచ్చి, పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు