Hema : బర్త్ డే కేక్ కట్ చేశానంతే.. నేను ఏ తప్పు చేయలేదు- హేమ

Hema : టాలీవుడ్ నటి హేమ రీసెంట్ గా బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో దొరికి టాలీవుడ్ లో సంచలనం రేపింది. టాలీవుడ్ సెలెబ్రటీస్ లో కొంతమంది పేర్లు వైరల్ కాగా, ప్రత్యక్షంగా అయితే నటి హేమను అరెస్ట్ చేసినప్పటి నుంచి, ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి, ఈ కేసులో తన పేరు ఉండకుండా చేయడానికి హేమ చాలా ప్రయత్నాలు చేసింది. కానీ నటి హేమ మాత్రం అక్కడికి వెళ్లినట్టు ప్రూవ్ కాగా, ఆమెను పోలీసులు విచారణకు హాజరు కావాల్సింది గా హెచ్చరించగా, ఆరోగ్య సమస్యలకారణాలతో హాజరు కాలేనని పలుమార్లు చెప్పుకొచ్చింది. ఫైనల్ గా మూడో సారి ఆమెను విచారణకు ఖచ్చితంగా హాజరు కమ్మని పోలీసులు ఆదేశించారు. తాజాగా నటి హేమను (Hema) బెంగళూరు సీసీబీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మంగళవారం ఆమెను కోర్టులో హాజరుపరచనున్నారు.

Hema says she did nothing wrong in the Bangalore rave party

అరెస్ట్ తర్వాత హేమ సంచలన వ్యాఖ్యలు..

ఇక బెంగళూరులో గత నెల 20న జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న హేమ ను పోలీసులు అరెస్టు చేసి విచారణలో అరెస్ట్ చేయగా, ఆ విచారణలో ఆమె సంచలన వ్యక్త్యలు చేసింది. తానే తప్పు చేయలేదని, ఆ రోజు బర్త్ డే కేక్ కట్ చేసి వెంటనే హైదరాబాద్ వచ్చేసానని చెప్పుకొచ్చింది. అలాగే సోషల్ మీడియా లో బిర్యానీ వీడియోలు పోస్ట్ లు చేసింది తానేనని పేర్కొన్నారు. అంతే కాదు ఇప్పటివరకు తన బ్లడ్ శాంపిల్స్ సేకరించలేదని, ఇప్పుడే తీసుకున్నారని చెప్పారు. ఓవరాల్ గా ఆమె తాజాగా మీడియా తో మాట్లాడిన వీడియోలో తాను ఏ తప్పు చేయలేదని నొక్కి నొక్కి అదే మాట కంటిన్యూ చేసింది. కాగా రేవ్ పార్టీ కేసులో హేమకు JMFC కోట్లు 14 రోజుల జ్యూడిషియల్ కస్టడి విధించింది.

- Advertisement -

దొరక్కుండా ఎంత ట్రై చేసినా ఏం లాభం..

ఇక నటి హేమ ముందుగా పోలీసుల విచారణకు బురఖాలో హాజరవడం హైలెట్ అయింది. చాలా సేపటివరకు మీడియా వారు ఆమెను గుర్తు పట్టలేదు. ఎందుకంటే బురఖాలో ఆమె ఎందుకొస్తుంది అనుకున్నారు అంతా. కానీ హేమ ఒక ముస్లిం ని పెళ్లిచేసుకున్న విషయం చాలా మందికి తెలీదు. ఆ కారణంగా వేసుకొచ్చిందని అనుకున్నా, దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్టు, ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే బురఖా వేసుకోవాల్సి వచ్చిందా? అయినా ఎంత ట్రై చేసినా మీడియా కి దొరక్కుండా, ప్రజల కంట పడకుండా తప్పించుకోలేదు హేమ అని నెటిజన్లు కామెంట్స్ చేసారు. ఇక మొన్నటి వరకు టాలీవుడ్ లో మంచు విష్ణు తదితర ప్రముఖులు హేమకు మద్దతు గా నిలిచారు. మరి ఇప్పుడు సాక్షాలు అన్ని హేమ ని దోషిగా చిత్రీకరిస్తున్నాయి. ఇప్పుడు హేమకు మద్దతుగా నిలుస్తారా? లేక ఆమె పై “మా” టీం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? లేక ఇక్కడితో ఈ విషయాన్నీ వదిలేస్తారా అన్నది చూడాలి. ఇక నటి హేమ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంత బిజీయో తెలిసిందే. బ్రహ్మానందం, అలీ వంటి కామెడియన్లతో ఎన్నో సినిమాల్లో జంటగా నటించి మెప్పించింది ఆమె.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు