Hero Darshan: కస్టడీ ముగింపు.. బెయిల్ లభిస్తుందా..?

Hero Darshan.. ప్రియురాలి కోసం అభిమానిని హత్య చేసిన కేసులో కన్నడ హీరో దర్శన్ ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇందులో ఏ 2 నిందితుడుగా దర్శన్ కొనసాగుతున్నారు. ముఖ్యంగా అభిమాని చిత్రదుర్గం వాసి రేణుక స్వామిని హతమార్చడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్, ఆయన ప్రేయసి పవిత్ర గౌడ ఇప్పటికే జైలు జీవితం అనుభవిస్తున్నారు. పైగా ఈ కేసులో 200కి పైగా సాక్షాదారాలను పోలీసులు చార్జ్ షీటులో సమర్పించారు.

Hero Darshan: Custody ends.. Will bail be available..?
Hero Darshan: Custody ends.. Will bail be available..?

అభిమాని హత్య కేసులో ప్రధాన నిందితుడిగా దర్శన్..

ఇక ఈ కేసుకు సంబంధించి బలమైన సాక్షాలు, నమ్మలేని నిజాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు, నెటిజన్లు దర్శన్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ కేసులో దర్శన్ కు బెయిల్ కూడా వచ్చే అవకాశం లేకుండా పోయింది. కానీ తాజాగా దర్శన్ కు ఆ విషయంలో కాస్త లైన్ క్లియర్ అయిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే, దర్శన్ మొన్నటి వరకు పరస్పన జైల్లో ఉండగా.. అక్కడ సకల సౌకర్యాలు రాజభోగాలు అనుభవిస్తున్నారనే వార్తలు , ఫోటోలు వైరల్ అవ్వడంతో అటు నుంచి బళ్లారి జైలుకి ఇటీవలే ఆయనను తరలించారు.

ఈరోజుతో గడువు పూర్తి..

ఇక దర్శన్ తో పాటు ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ అలాగే హత్య కేసులో భాగమైన మరో 15 మంది నిందితులను గ్రూపులుగా డివైడ్ చేసి వివిధ ప్రాంతాల జైల్లకు తరలించారు. ఈ హత్య కేసులో అరెస్ట్ అయిన నిందితుల జ్యుడీషియల్ కస్టడీ సెప్టెంబర్ 9 న సోమవారంతో ముగియనుంది. దీంతో నటుడు దర్శన్ తో సహా మిగిలిన నిందితులందరికీ రేపు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బెంగళూరు 24వ ఏసిఎంఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు. అలాగే పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ మొత్తం 17 మంది నిందితులకు అందజేయనున్నారు. ఇక ఈ చార్జి సీటు అందిన తర్వాత వీరంతా కూడా రేపు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

బెయిల్ లభిస్తుందా..?

ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితులైన పవిత్ర గౌడ, దర్శన్ సోమవారం బెయిల్ కి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని సమాచారం. గత కొన్ని నెలలుగా బెయిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న దర్శన్ కు ఈ విషయంలో కాస్త ఊరట లభించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా తమ హీరోకి బెయిల్ వస్తుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం నిజంగా ఉంటే, త్వరలోనే దర్శన్ బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే దాదాపు 200లకు పైగా సాక్షాధారాలను అందించిన పోలీసులు, అవన్నీ నేర నిరూపణ అయ్యాయి కాబట్టి దర్శన్ కు ఇందులో బెయిల్ వస్తుందా రాదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి దర్శన్ కు బెయిల్ కి అప్లై చేసుకునే అవకాశం ఉందా లేదా అనే విషయాలు రేపు తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు