Hero Dharshan : ఇదేం పిచ్చిరా బాబు.. దారుణంగా తయారైన దర్శన్ ఫ్యాన్స్..

Hero Dharshan : ప్రస్తుతం కన్నడ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అంటే దర్శన్, పవిత్రలు.. ఓ అభిమాని కేసులో వీరిద్దరూ అరెస్ట్ అయ్యారు.. ఈ కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు.. ఈ క్రమంలో ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.. దర్శన్, పవిత్రల చుట్టు ఎన్నో వివాదాలు తిరుగుతున్నాయి.. రోజురోజుకు ఈ కేసు కీలకంగా మారుతుంది.. హీరో దర్శన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.. ఆయన అభిమానులు హీరో పై అభిమానాన్ని వివిధ రకాలుగా చాటుకుంటున్నారు.. తాజాగా చిన్న బాబు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

దర్శన్ జైల్లో ఉన్నాడని తెలుసుకున్న అభిమానులు జైలు బయట క్యూ కడుతున్నారు.. ఒకవైపు దర్శన్ ను కోర్టుకు తీసుకెళ్తుంటే మరోవైపు ఫ్యాన్స్ సినిమా షూటింగ్ అంటూ డీ బాస్ అని జైలు దగ్గర నినాదాలతో హోరేత్తిస్తున్నారు.. తన కోసం వారి అభిమానాన్ని పలు రకాలుగా చాటుకొంటున్నారు.. తాజాగా ఓ అభిమాని తన హీరో కోసం వినూత్న ఆలోచన చేశాడు.. తన కొడుకు ఖైదీ డ్రెస్స్ వేయించి, పక్కన బేడీలు పెట్టాడు.. అలాగే దర్శన్ జైలు ఖైదీ నెంబర్ ను కూడా పెట్టాడు.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

hero darshan fans latest photos
hero darshan fans latest photos

ఇక మరికొంతమంది మాత్రం అభిమాన హీరో పై రకరకాలుగా అభిమానాన్ని చాటుకుంటున్నారు.. ఏకంగా తమ అభిమాన హీరో ట్రైయల్ ఖైదీ నంబర్ ను టాటూలుగా వేయించుకున్నారు.. అభిమానులు హీరో పై అభిమానాన్ని ఎలా చూపిస్తున్నారో ఈ ఫోటోలను వీడియోలను చూస్తే తెలిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వీటిని చూసిన నెటిజన్లు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.. ఇదేం పిచ్చిరా బాబు అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారింది..

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు