Hero NaraRohit: 6 యేళ్ళ గ్యాప్ పై క్లారిటీ..!

Hero NaraRohit.. నారా వారి హీరో నారా రోహిత్ అందరికీ సుపరిచితమే.. ప్రతినిధి 2 సినిమాతో ఆరేళ్ల తర్వాత కం బ్యాక్ ఇస్తున్న ఈ హీరో తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాలకు ఆరేళ్ల పాటు గ్యాప్ ఎందుకు ఇచ్చారు? అన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు.. సోలో, ప్రతినిధి, రౌడీ ఫెలో , అప్పట్లో ఒకడుండేవాడు వంటి సూపర్ హిట్ సినిమాలతో మెరిసిన నారా రోహిత్ కొన్ని సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇచ్చారు.. అయితే ఆ తర్వాత ఈయన నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక చివరిగా 2018లో వీర భోగ వసంతరాయలు అనే చిత్రంలో కనిపించిన ఈయన మళ్ళీ తెరపై కనిపించలేదు..

Hero NaraRohit:Clarity on the gap of 6 years..!
Hero NaraRohit:Clarity on the gap of 6 years..!

ఆరేళ్ల గ్యాప్ పై క్లారిటీ..

నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాతో ఆరేళ్ల తర్వాత కం బ్యాక్ ఇవ్వబోతున్నారు.. ఏప్రిల్ 25వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.. ఆ తర్వాత సుందరకాండ సినిమాని కూడా ప్రకటించారు.. ఈ సినిమాలో ప్రభాస్ తో రొమాన్స్ చేసిన శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ కి తల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ప్రతినిధి 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నారా రోహిత్ ఎందుకు ఆరు సంవత్సరాల పాటు సినిమాకు దూరంగా ఉన్నారో క్లారిటీ ఇచ్చారు.. నారా రోహిత్ మాట్లాడుతూ.. 2017, 2018 సమయంలో నా సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి. నేను సెలెక్ట్ చేసుకున్న సినిమాలే నాకు నచ్చలేదు.. స్క్రిప్ట్ సెలక్షన్ లో కూడా తప్పు చేశానని.. సినిమా తెరపై చూసినప్పుడు అనిపించింది. దీంతో ఒక రెండేళ్ల గ్యాప్ తీసుకుందాం అనుకున్నాను.. ఆ తర్వాత కరోనా కూడా వచ్చింది ..ఆ గ్యాప్ కూడా పెరిగింది. కానీ ఈ గ్యాప్ లో చాలా కథలు విన్నాను.. వాటిల్లో కొన్ని ఓకే చేశాను.. అందులో ఒకటి ప్రతినిధి 2.. ఇక ప్రతినిధి 2 సినిమాకి ఇప్పుడు వస్తున్నాను.. ఇకపై వరుసగా సినిమాలు వస్తాయి.. మళ్లీ గ్యాప్ తీసుకొని మంచి కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే కథలతోనే ముందుకు వస్తాను అంటూ నారా రోహిత్ క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికైతే రెండేళ్ల గ్యాప్ కాస్త ఆరేళ్ల గ్యాప్ అయిందని క్లారిటీ ఇచ్చారు నారా రోహిత్.

ప్రతినిధి 2 సినిమా విశేషాలు..

ఇక నారా రోహిత్ ప్రతినిధి -2 సినిమా విషయానికి వస్తే.. గత రెండు రోజుల క్రితం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతినిధి -2 ట్రైలర్ ను విడుదల చేశారు.. పొలిటికల్ లీడర్స్ పై ప్రశ్నలు కురిపిస్తూ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది ఈ ట్రైలర్.. జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నారా రోహిత్ హీరోగా , శ్రీ లీలా హీరోయిన్గా తెరకెక్కుతోంది.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. జనవరి 30 1948 న స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ మరణించిన తర్వాత గుండెపోటుతో ఎంతమంది మరణించారు అని జర్నలిస్ట్ పాత్ర పోషించిన నారా రోహిత్ అడగడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది.. ప్రస్తుత రాజకీయాలను అద్దం పట్టేలా ఈ సినిమా విడుదల చేయబోతున్నారు.. మరి ఈ సినిమా ఎంత మేరకు రాజకీయాలపై ప్రభావితం చూపిస్తుందో చూడాలి. ఇకపోతే దాదాపు పది సంవత్సరాల క్రితం 2014లో ఇదే తేదీన విడుదలవుతూ ఉండడం గమనార్హం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు