Hero Nithin: అయ్యో హీరో నితిన్ కి ఏమైంది, ఇలా మారిపోవడానికి కారణాలేంటి

Hero Nithin: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో నితిన్ ఒకరు. జయం అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి నితిన్ కి. వివి వినాయక దర్శకత్వంలో చేసిన దిల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు దిల్ రాజు.

అయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత దాదాపు ఒక పదేళ్ల వరకు నితిన్ కెరియర్ లో హిట్ సినిమా లేకుండా పోయింది. విక్రం కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆడియో లాంచ్ లో నితిన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన తనకు ఉన్న ఇష్టాన్నంతా కూడా చెప్పుకొచ్చాడు. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నితిన్ కి ఫ్యాన్స్ అయిపోయారు. నితిన్ సినిమా ని ఎంకరేజ్ చేయడం కూడా మొదలుపెట్టారు.

Nithin

- Advertisement -

ఇష్క్ సినిమా తర్వాత వితిన్ కెరియర్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చేసింది. రీసెంట్ టైమ్స్ లో నితిన్ సినిమాలు ఫెయిల్ అయినా కూడా మార్కెట్ పెద్దగా దెబ్బ తినలేదు అని చెప్పొచ్చు. నితిన్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అని ఒక సినిమాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో 25 సంవత్సరాల తర్వాత రాబిన్ ఫుడ్ ఎలా ఉండబోతున్నాడు అంటూ ఒక గెటప్ వీడియో బయటకొచ్చింది. ఈ వీడియోలు నితిన్ బాగా ముసలితనంతో కనిపిస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న చాలామందిలో నితిన్ కి ఒక్కసారిగా ఏమైంది అని భయం పట్టుకుంది. తర్వాత ఇది సినిమా కోసం అనే విషయం తెలిసాక అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు