Hero Venu : కోట్ల రూపాయల స్కాం… ఎఫ్ఐఆర్ లో హీరో వేణు పేరు..!

Hero Venu: ప్రముఖ సీనియర్ హీరో వేణు పై తాజాగా కేసు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి.అసలు విషయంలోకి వెళ్తే.. తెలంగాణ మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నిర్వాహకులు.. మరో ప్రజా ప్రతినిధి, సినీనటుడు తొట్టెంపూడి వేణు తో పాటు ఈ సంస్థ ఎండి పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు స్పష్టం చేశారు.

హైకోర్టును ఆశ్రయించిన ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ..

Hero Venu: Crores of rupees scam... Hero Venu's name in the FIR
Hero Venu: Crores of rupees scam… Hero Venu’s name in the FIR

పోలీసులు అందిస్తున్న సమాచారం మేరకు.. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక పనిని.. తెహ్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రాజెక్టును దక్కించుకుంది.. ఈ పనిని బంజారాహిల్స్ లోని రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ తో పాటూ స్వాతి కన్స్ట్రక్షన్స్ సంస్థలు ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ నుండి సబ్ కాంట్రాక్టు పొందారు.. ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్వాతి కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే ఆ పని నుండి తప్పుకోవడంతో రిత్విక్ ప్రాజెక్ట్ మాత్రమే 2002 నుండి పనులు మొదలు పెట్టింది. ఆ పనులకు రూ.450 కోట్లను టిహెచ్డీసీ అందించింది.. అందులో 5.5 శాతం ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ తీసుకొని.. మిగిలిన 94.5% రిత్విక్ కన్స్ట్రక్షన్స్ ఖాతాలో వేశారు.. ఆ తర్వాత తెహ్రి డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ మధ్య ఏర్పడిన వివాదం వల్ల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.

వేల కోట్ల స్కామ్ లో వేణు అరెస్ట్.

దీంతో ఇప్పుడు మిగిలిన పనులకు గానూ సుమారుగా రూ.10.10 కోట్లు విడుదల కాగా ఆ డబ్బును తెహ్రి డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జమ చేయడం జరిగింది.. ఇక ఒప్పందం ప్రకారం వాటాలు తీసుకోవాల్సి ఉండగా.. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ సంస్థ ప్రతినిధి, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు కొడుకు కావూరి భాస్కరరావు , మరో ప్రతినిధి అయిన సినీ నటుడు వేణు తొట్టెంపూడి, కావూరి భాస్కరరావు తల్లి , పిసిఎల్ సంస్థ డైరెక్టర్ కే. హేమలత, సోదరీ శ్రీ వాణి లతో పాటు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ పాతూరి.. రిత్విక్ ప్రాజెక్ట్స్ తో చేసుకున్న ఒప్పంద హక్కులను రద్దు చేశారు.. దీంతో ఉద్దేశపూర్వకంగానే మోసం చేసి మొత్తం డబ్బును తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులపై రిత్విక్ ప్రాజెక్ట్స్ ఉపాధ్యక్షుడు టి. రవిక అష్ణ గురువారం రాత్రి బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వేణు తొట్టెంపూడి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తం ఐదు మంది పైన సెక్షన్ 406, 506 రెడ్ విత్ 34, 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

కలవరపాటు చెందుతున్న ఫ్యాన్స్..

మొత్తానికైతే కోట్ల రూపాయల స్కాంలో వేణు తొట్టెంపూడి ని పోలీసులు అరెస్టు చేసి.. ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేసినట్లు తెలుస్తోంది.. మరి దీనిపై ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మరి ఈ విషయంపై వేణు తొట్టెంపూడి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు ఆందోళనతో పాటు కలవరపాటుకు గురవుతున్నారు. ఇక పూర్తి నిజా నిజాలు తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే .

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు