Hero Vishal: ఆ తెలుగు సినిమాలో విలన్ గా విశాల్.. హీరో ఎవరంటే..?

Hero Vishal.. తెలుగు హీరో అయినప్పటికీ కోలీవుడ్ లో సెటిలైపోయిన తమిళ స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అటు తమిళ్ , ఇటు తెలుగు చిత్రాలలో నటించి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టే తమిళంలో తెరకెక్కించే తన ప్రతి సినిమాని కూడా తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా తమిళ సినీ ఇండస్ట్రీ అభివృద్ధికి మెయిన్ పిల్లర్ గా వ్యవహరిస్తున్నారు విశాల్. నడిగర్ సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారు. అలాగే నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా మాత్రమే కాదు తమిళనాడులో ఏ ఉపద్రవం వచ్చినా సరే ఫిలిం ఇండస్ట్రీ నుంచి స్పందించే మొదటి వ్యక్తిగా కూడా గుర్తింపు దక్కించుకున్నారు.

Hero Vishal: Vishal as the villain in that Telugu movie.. Who is the hero..?
Hero Vishal: Vishal as the villain in that Telugu movie.. Who is the hero..?

తెలుగు సినిమాలు చేయని విశాల్..

అందుకే ఈయనకు తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి గుర్తింపు ఉంది. అంతేకాదు ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో మంచి కలెక్షన్లు రాబడుతూ ఉంటాయి. ఇటీవలే ఆంధ్ర నుంచి రాజకీయంగా పోటీ చేస్తానని కూడా చెప్పినట్లు సమాచారం. ఇక తెలుగువాడు అయ్యుండి , తెలుగు మూలాలు ఉన్నప్పటికీ తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. దీంతో తెలుగు అభిమానులంతా ఎప్పుడు తెలుగు సినిమా చేస్తారు అంటూ చాలాకాలంగా ప్రశ్నిస్తున్నారు. విశాల్ ముందుకి కూడా ఈ విషయాన్ని చాలా సార్లు ప్రస్తావనకు తీసుకొచ్చారు. ఇక పక్క తమిళ హీరోలైన విజయ్, ధనుష్ లు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేస్తూ ఉంటే విశాల్ మాత్రం ఎందుకు చేయడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలుగు సినిమాలో విలన్ గా అవకాశం..

ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. తమిళం నుంచి, బాలీవుడ్ నుంచి చాలామంది స్టార్ హీరోలు తెలుగులో విలన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిచ్చా సుదీప్ కూడా ఇక్కడ విలన్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పుడు అలాంటి అవకాశమే విశాల్ కి కూడా వచ్చిందని సమాచారం. ఒక టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో విలన్ క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చిందట. కానీ ఈ సినిమాని వదిలేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు అల్లు అర్జున్, ఆ చిత్రం వరుడు.. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ యాక్షన్ చిత్రం ఇది. ఈ సినిమాలో అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా జంటగా నటించిన ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య విలన్ గా నటించి మెప్పించారు. సినిమా హిట్ అవ్వకపోయినా విలన్ గా నటించిన ఆర్యకు మాత్రం మంచి గుర్తింపు లభించింది.

- Advertisement -

అల్లు అర్జున్ కు పోటీగా..

ఈ సినిమాలో ముందుగా విశాల్ ను విలన్ గా అనుకున్నారు.. కానీ హీరోగా మంచి ఊపు మీద ఉన్న ఆయన తెలుగులో తన మార్కెట్ ను చెడగొట్టుకోవడం ఇష్టం లేక పాత్రను రిజెక్ట్ చేశారు. అయితే చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక బడా స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించే అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఒకసారి ఛాన్స్ మిస్సయింది కాబట్టి…ఈసారి కూడా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో విలన్ గా నటించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి అప్పట్లో వద్దనుకున్న విశాల్ మరి ఇప్పుడు మళ్లీ అదే హీరోతో ఢీ అంటారా.. ఇక నిజానిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం మూవీ ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు