Hero Vishal : రాజకీయాల్లోకి తప్పకుండా వస్తా

సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరిగా రాజకీయాల వైపు మొగ్గు చూపడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. NTR నుంచి పవన్ కళ్యాణ్ దాక …. ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచిన వారే. ఈ నేపథ్యంలోనే ప్రముఖ సినీ నటుడు విశాల్ రాజకీయాలలోకి వస్తున్నాడని, కుప్పం నుంచి పోటీ చేయబోతున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణించిన సమయంలో విశాల్ పోటీ చేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాల్ చాలా హడావిడి చేశారు. అయితే నామినేషన్ వేసిన తర్వాత విశాల్ కు అనూహ్యంగా షాక్ తగిలింది. ఆ సమయంలో విశాల్ సొంత పార్టీ పెట్టడం ఖాయమని అందరూ భావించారు. కానీ విశాల్ మాత్రం కొద్దిరోజులు సైలెంట్ అయ్యారు.

ఇక తాజాగా మరోసారి ఆయన కుప్పం నుంచి పోటీ చేయబోతున్నాడు అనే వార్తలు వినిపించడంతో వీటిపై ఆయన స్పందించారు. విశాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం లాఠి విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ ప్రమోషన్స్ కు సంబంధించి చెన్నైలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ.. “నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం. సామాజిక సేవ చేయడం నాకు ఎంతో ఇష్టం. కానీ కుప్పం నుంచి చంద్రబాబుపై పోటీ చేస్తానన్న వార్తలలో నిజం లేదు. కుప్పం ప్రాంత ప్రజలతో నాకు ఉన్న అనుబంధం వాస్తవమే.. అక్కడ మా తండ్రి గ్రానైట్ వ్యాపారం చేసేవారు. మూడేళ్ల పాటు అక్కడే ఉన్నాను. ప్రస్తుతం సినిమాలతో బాగా బిజీగా ఉన్నాను. చంద్రబాబుపై పోటీ చేయాలనే ఉద్దేశం లేదు” అని తేల్చి చెప్పారు విశాల్. ఈ సారైనా రాజకీయాలకి వస్తారో లేదో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు