RGV: ఆఫర్ కోసం ఆర్జీవిని కాంటాక్ట్ అవుతే సె*** వీడియోస్ షేర్ చేశాడు.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

RGV: బాలీవుడ్ నటి అదే విధంగా హైదరాబాద్ బ్యూటీ షెర్లిన్ చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ప్లే బోయ్ అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా స్టిల్స్ ఇస్తూ తన వైపు ఆకర్షించుకుంటుంది. ఇక చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మిస్ ఆంధ్రగా విజయం సాధించింది. ఆ తరువాత వెండి మబ్బు అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా అరంగేట్రం చేసింది.

రెండు, మూడు సినిమాలు మాత్రమే తరువాత చేయగలిగింది. ఇక ఆ తరువాత ఆఫర్స్ రాకపోవడంతో బాలీవుడ్కు షిఫ్ట్ అయింది. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలు చేయడమే కాకుండా హాలీవుడ్ లో కూడా సినిమా అవకాశాలు దక్కించుకుని బిజీగా మారింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు టాలీవుడ్ అగ్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై చేయడం విశేషం. తాజాగా యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ..” నాకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అంటే చాలా ఇష్టం ఉండేది.

Heroine bold comments
Heroine bold comments

ఆర్జీవి తన సినిమాలో హీరోయిన్స్ ను చాలా అందంగా చూపిస్తారు. అయితే ఒకసారి నేను..‌ మీ సినిమాలో ఏదైనా ఆఫర్ ఉంటే ఇవ్వండి అంటూ మెసేజ్ చేశాను. దీంతో ఆయన నాకు ఓ స్క్రిప్ట్ పంపిస్తున్నాను. మీకు నచ్చితే చూద్దాం అన్నారు. కానీ అందులో అన్ని సెక్స్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. ఇక తర్వాత ఆయన నాకు ఓ వీడియో పంపించాడు. అందులో అన్ని శృంగార సన్నివేశాలు ఉన్నాయి. దీంతో నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. ఇలా పంపడం కరెక్ట్ కాదు అని అడగగా ఆయన నాకు ఇది కామన్ అని మెసేజ్ పెట్టారు ” అంటూ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు