Heroine Murdered..ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు కూడా అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారని కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది.. ఈ క్రమంలోనే తాజాగా హాలీవుడ్ లో ఒక సంచలన ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. ప్రముఖ నటుడు నిక్ పాస్క్వల్ (34) తన మాజీ ప్రియురాలిని ఆమె నివాసంలోనే ఏకంగా 20 సార్లు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్యాయత్నం చేసినట్లు ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ వార్త ఒక్కసారిగా ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిందని చెప్పవచ్చు..
ప్రేయసి పై 20 సార్లు కత్తిపోటు..
తాజాగా సమాచారం ప్రకారం.. ఈ విషయాన్ని లాస్ ఏంజెల్స్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఆఫీస్ వెల్లడించింది. నటుడు తన ప్రియురాలిపై ఆ హత్యాయత్నం చేశారని.. ఆ తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు అటార్నీ ఆఫీస్ వెల్లడించింది. ఆయనను పోలీసులు టెక్సాస్ లోని యూఎస్ – మెక్సికో సరిహద్దు చెక్ పాయింట్ వద్ద పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున 4:30 గంటల షెహార్న్ నివాసంలో జరిగింది. ఇతడికి.. మాజీ ప్రేయసి కి మధ్య ఎటువంటి విభేదాలు వున్నాయో తెలియదు కానీ.. నటుడు ఆమె ఇంటిలోకి చొరబడి తనపై పలు కత్తిపోట్లతో దాడి చేశారట. ఆ దాడిలో తీవ్ర గాయాలు కావడంతో ఆమెను ఆమె సన్నిహితులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
జీవిత ఖైదీ శిక్ష పడే అవకాశం..
గోఫండ్ మీ పేజీలో హాలీవుడ్ మేకప్ ఆర్టిస్ట్ అల్లీ షెహార్న్ అని పిలువబడే బాధితురాలు ఇటీవల పాస్ వాల్ పై నిషేధాజ్ఞను రూపొందిందని ప్రాసిక్యూటర్లు కూడా తెలిపారు.. ఇంత దారుణంగా ఆమెను హత్యాయత్నానికి పాల్పడడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటన జరిగిన వెంటనే అరెస్టు వారెంట్ జారీ అయింది.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.. ఇక నటుడు గృహహింసలో భాగంగా బాధితురాలని తీవ్రంగా గాయపరిచాడని.. తన భాగస్వామినే కాకుండా ఇంటి సభ్యునికి గాయం చేయడం లాంటి ఆరోపణలు ఎదుర్కొన్నాడట. ఒకవేళ ఇవే నిజమైతే ఆయనకు జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం ఉన్నదని అంటున్నారు కొంతమంది.. ఏదేమైనా ఈమెను ఇంత దారుణంగా కత్తితో ఏకంగా 20 సార్లు పొడవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఇక ఈమె స్టేట్మెంట్ ఇస్తే అతడికి జీవిత ఖైదు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.