Rakshitha: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవితేజ హీరోయిన్.. ఫోటోలు వైరల్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి.. సినీ ప్రపంచానికి కాస్త గ్యాప్ ఇచ్చినా కూడా ఊహించని లుక్ లోకి మారిపోతూ ఉంటారు హీరోయిన్లు.. అదే తరహాలో ఇప్పుడు ఒక హీరోయిన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.. రవితేజ హీరోగా ఇడియట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ బ్యూటీ రక్షిత… ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో కొన్నేళ్ల పాటు తెలుగులో చక్రం తిప్పింది.. వరుసగా స్టార్ హీరోలతో నటించింది.. అలా చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈమె.. అందరివాడు సినిమా తర్వాత ఉన్నట్టుండి తెలుగు ఇండస్ట్రీకి దూరమయింది..

రక్షిత వివాహం..
కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే 2007లో కన్నడ ఫిలిం డైరెక్టర్ ప్రేమ్ ని వివాహం చేసుకున్న ఏమే గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.. చాలా బరువు పెరిగిపోయి.. ఈమేనా అని చూసిన వారంతా ఆశ్చర్యపోక మానరు.. అంతలా బరువు పెరిగిపోయింది రక్షిత.. తాజాగా కన్నడలో పాపులర్ టెలివిజన్ షో వీకెండ్ విత్ రమేష్ షోలో పాల్గొన్న రక్షిత తన చిన్నతనంలో జరిగిన ఒక విషయం చెప్పి అందరిని నవ్వించింది..

13 ఏళ్లకే అలాంటి పని..
రక్షిత తనకు 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక దొంగని పట్టుకున్నానని.. చిన్నప్పుడే బ్యాట్ తో ఆ దొంగని తరిమికొట్టానని వీకెండ్ విత్ రమేష్ కార్యక్రమంలో చెప్పి ఆశ్చర్యపరిచింది.. ఇక ఈ సంఘటన గురించి ఈమె మాట్లాడుతూ.. ఒక దొంగ ఒకరోజు మా ఇంట్లోకి దూరాడు.. మేము అప్పుడు చాలా చిన్నవాళ్ళం. ఏం చేయాలి.. తండ్రిని , తల్లిని నిద్రలేపి దొంగ వచ్చాడని చెప్పాలి.. అయితే నేను ఇంట్లో ఉన్న ఒక బ్యాట్ పట్టుకొని దొంగను వెంబడించాను.. అప్పుడు నా వయసు కేవలం 13 ఏళ్లు మాత్రమే.. నేను మెల్లగా డోర్ తెరిచి బ్యాట్ పట్టుకొని బయటకి వచ్చి ఎవరా అని అరవగానే.. దొంగ పారిపోయాడు.. అతను దూకి పారిపోగానే. నేను ఇంట్లోకి పరిగెత్తాను అంటూ రక్షిత తెలిపింది..

- Advertisement -

రక్షిత వ్యక్తిగత జీవితం..
వివాహమనంతరం కొన్ని రోజులకి ఒక బాబుకి జన్మనిచ్చిన ఈమె ఇప్పుడు కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తోంది.ఇకపోతే అసలు బరువు పెరిగిన తర్వాత ఈమెను ఏమాత్రం పోల్చుకోలేకపోతున్నారు అభిమానులు.. థైరాయిడ్ కారణంగానే బరువు పెరిగినట్లు మొన్నామధ్య ఒక రియాల్టీ షోలో రక్షిత చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.. ఏది ఏమైనా ఈమె మళ్లీ బరువు తగ్గి సినిమాలోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి రక్షిత సినీ ఇండస్ట్రీలోకి వస్తుందా లేక వైవాహిక జీవితానికే కెరియర్ ని అంకితం చేస్తుందా అన్నది చూడాలి.. ఒకానొక సమయంలో తన నటనతో అందరినీ అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇలా ఉన్నట్టుండి ఇండస్ట్రీకి దూరం అవడం అభిమానులకు కాస్త నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు.

Heroine Rakshitha latest photos went viral

Heroine Rakshitha latest photos went viral

Heroine Rakshitha latest photos went viral

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు