Heroine Ramba: ఎన్టీఆర్ పై అలాంటి కామెంట్స్ చేసిన రంభ..!

Heroine Ramba: ఒకప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమను తన అందచందాలతో ఉర్రూతలూగించిన హీరోయిన్ రంభ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. తనకంటూ స్పెషల్ ఫ్యాన్ క్రియేట్ చేసుకున్న ఈ చిన్నది ..ఆటిట్యూడ్ బ్యూటీగా.. ఇన్నోసెంట్ అమ్మాయిగా.. గ్లామరస్ నటిగా… పల్లెటూరి పిల్లగా ఇలా అన్ని పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించింది.. ముఖ్యంగా ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈమె 10 సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.. కెరియర్ లో తమిళంలో 35, తెలుగులో 40, కన్నడలో 9, మలయాళం లో 7, హిందీలో 17 సినిమాలు చేసి అందరిని ఆకట్టుకుంది.. ఇకపోతే తన కెరియర్ లో మొత్తం 117 సినిమాలు చేసిన ఈమె.. అందులో కొన్ని ఐటెం సాంగ్స్ లో కూడా నర్తించి ఆకట్టుకుంది.. ముఖ్యంగా బాలయ్య, చిరంజీవి అల్లు అర్జున్, ప్రభుదేవా వంటి హీరోలతో పనిచేసిన ఈమె.. వారందరినీ కాదని ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కే ఓటేసింది ఈ ముద్దుగుమ్మ..

వ్యక్తిగతంగా చిరంజీవి.. డాన్స్ పరంగా ఎన్టీఆర్..

Heroine Ramba: Ramba made such comments on NTR..!
Heroine Ramba: Ramba made such comments on NTR..!

కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైన రంభ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. డాన్స్ బాగా చేసిన హీరోలలో మీ ఫేవరెట్ ఎవరు అని అడగగా …వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేసింది. అతడిని చూస్తే ముచ్చటేస్తుందని. డాన్స్ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందని.. ముఖ్యంగా అతను అంటే చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చింది రంభ.. ఇక అలాగే ఎన్టీఆర్ డాన్స్ పై ప్రశంసలు కూడా కురిపించింది.. ఇకపోతే వ్యక్తిగతంగా చిరంజీవి అంటే ఇష్టమని కానీ డాన్స్ పరంగా ఎన్టీఆర్ అంటే ఇంకా ఇష్టమని చెప్పుకొచ్చింది.

ఎన్టీఆర్ డాన్స్ కి రంభ ఫిదా..

మొత్తానికైతే రంభ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ డాన్స్ కి ఒక్క రంభ మాత్రమే కాదు ఇప్పటికే చాలామంది హీరోయిన్లు కూడా ఫిదా అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రంభ చేసిన కామెంట్లు ఇప్పుడు మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ కెరియర్..

ఇక జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన.. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి హీరోగా మెప్పించారు.. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేసి పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సొంతం చేసుకోవడమే కాదు.. ఆస్కార్ రెడ్ కార్పెట్ పైన నడిచి తన ఇమేజ్ ను రెట్టింపు చేసుకున్నారు.. ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. మరొకవైపు కేజీఎఫ్ సినిమాలతో కన్నడ సినీ పరిశ్రమను దేశానికే పరిచయం చేసిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ అటు హీరోగా ఇటు విలన్ గా కూడా నటించనున్నట్లు సమాచారం.. ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియనున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు