Heroine Rasi: కోటీశ్వరులను కాదని అతని వెంట వెళ్ళిన రాశి .. కట్ చేస్తే..!

Heroine Rasi.. చాలామంది సెలబ్రిటీలు సైతం ఎక్కువగా వ్యాపారవేత్తలను లేకపోతే తన తోటి హీరోలను సైతం వివాహం చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువగా హీరో, హీరోయిన్స్ ప్రేమించుకొని వివాహం చేసుకుంటున్నారు. ఈ పద్ధతి అన్ని భాషలలో కూడా ఉన్నది. కానీ టాలీవుడ్ హీరోయిన్ అయినటువంటి ఒక హీరోయిన్ మాత్రం ఎంతోమంది కోటీశ్వరులు వివాహం చేసుకుంటామని వచ్చినా కూడా వారందరిని వద్దని చెప్పి మరీ అసిస్టెంట్ డైరెక్టర్ ని వివాహం చేసుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు రాశి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన ఈ అమ్మడు హీరోయిన్ గానే కాకుండా విలన్ గా కూడా నటించింది.

Heroine Rasi: The Rasi that went with him not the millionaires.. If cut..!
Heroine Rasi: The Rasi that went with him not the millionaires.. If cut..!

చివరిగా నటించింది ఆ సినిమానే..

అబ్బాయిల కలల రాకుమారిగా పేరుపొందిన రాశి ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తూ ఉండేది.. అప్పట్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈమె ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో నటించింది. మొదటిసారి రావు గారి ఇల్లు అనే చిత్రంతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది రాశి. రాశి తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం , హిందీ వంటి భాషలలో కూడా నటించింది. తెలుగులో రాశి నటించిన ఎన్నో చిత్రాలు సైతం బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచాయి. ఈమె దేవి అభయం అనే సినిమా తర్వాత మరే సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.

కోటీశ్వరులని కాదని అసిస్టెంట్ డైరెక్టర్ తో పెళ్లి..

ఇక హీరోయిన్ గా ఫేడౌట్ అవ్వడంతో పలు చిత్రాలలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఈమె పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం బుల్లితెర పైన సీరియల్స్ లో కూడా మకుటం లేని మహారాణిల దూసుకుపోతోంది రాశి.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాశి అసిస్టెంట్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం పై పలు విషయాలను తెలిపింది. రాశీ పెళ్లి చేసుకున్న అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో కాదు శ్రీముని ( ఎస్. ఎస్ నివాస్ ) నే ఈమె ప్రేమించి మరి వివాహం చేసుకున్నది. ఈయన రాశి నటించిన ఎన్నో చిత్రాలకు సైతం అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట.

- Advertisement -

ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న రాశి..

అలా ఎన్నో చిత్రాలలో కలిసి పనిచేయడం చేత వీరిద్దరి మధ్య స్నేహం కుదిరిందని.. ఆ తర్వాత రాశి తండ్రి మరణించడంతో.. ఆమెకు తోడుగా అండగా నిలబడిన శ్రీమునీ తన వ్యవహారాలన్నీ దగ్గరుండి చూసుకునే వారట.. ఆ సమయంలోనే రాశికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చాలామంది వ్యాపారవేత్తలు, కోటీశ్వరులు వచ్చినా కూడా ఆమె నో అని చెప్పి తనకు నచ్చిన శ్రీముని పెళ్లి చేసుకుందట. కోటీశ్వరులు వచ్చిన సరే తన ప్రేమను నిలబెట్టుకోవడానికి ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకున్న రాశి ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.. ఏది ఏమైనా స్టార్ హీరోయిన్స్ ఎప్పుడు ఏ విధంగా తమకు నచ్చిన వారిని వివాహం చేసుకుంటారో చెప్పడం అసాధ్యం అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు