Heroine Sada: జయం సినిమా తర్వాత సదా కి ఆఫర్లు రాకుండా చేశారా.. అసలు నిజం బయటికి..?

Heroine Sada.. కోలీవుడ్ హీరోయిన్ సదా తెలుగులో జయం సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత వరుసగా ఆఫర్లు వస్తాయని అందరూ అనుకున్నారు.. కానీ అడపాదడపా సినిమాలలో మాత్రమే నటించింది.. అయితే జయం సినిమా తర్వాత తనకు ఆఫర్లు రాకుండా చేశారు అని, అసలు నిజాన్ని బయటపెట్టింది సదా. ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

Heroine Sada: Did Sada not get offers after the movie Jayam? Is the truth out?
Heroine Sada: Did Sada not get offers after the movie Jayam? Is the truth out?

జయం చిత్రం తర్వాత అవకాశాలు కోల్పోయింది..

హీరోయిన్ సదా జయం చిత్రంతో తొలిసారి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిన ఈ ముద్దుగుమ్మ .. పల్లెటూరి అమ్మాయిలా లంగా వోణీలో ఆడియన్స్ ని మాయ చేసింది.. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేసింది.. కానీ ప్రారంభంలో ఆ స్థాయి హిట్టు పడలేదు.. కొంత గ్యాప్ తో మళ్ళీ సక్సెస్ఫుల్గా ఫిలిం ఇండస్ట్రీలో దూసుకుపోయింది. నిజానికి జయం సినిమా సక్సెస్ తర్వాత ఆఫర్లు వరుసగా వస్తాయి అనుకుంది.. కానీ అలా రాకపోయేసరికి స్టడీస్ పైన దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ .. అయితే ఎందుకు స్టడీస్ వైపు వెళ్లాల్సి వచ్చింది? ఎవరు ఆమెకు సినిమాలు రాకుండా చేశారు? అనే విషయాలను ఆమె వెల్లడించింది..

అవకాశాలు రాకుండా చేశారు..

సదా మాట్లాడుతూ.. నాది సినిమా బ్యాక్ గ్రౌండ్ కాదు.. ఎన్నో కష్టాలు పడ్డాను.. అదే సమయంలో తేజ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు.. జయం సినిమాలో ఆఫర్ రావడం పెద్ద లక్కీగా భావించాను.. అయితే ఈ సినిమా హిట్ అని కూడా నాకు తెలియదు.. ఆ సినిమా హిట్ అయింది అని కూడా నాకు ఎవరూ చెప్పలేదు.. నా నంబర్ అప్పట్లో అందరి దగ్గర ఉంది కానీ నేను పీఆర్పీ టీం ను మెయింటైన్ చేయలేదు.. అలా చేయాలనీ కూడా నాకు తెలియదు .. ఇక అవకాశాలు రావడానికి సంబంధించి ఎవరిని అప్రోచ్ కావాలో కూడా తెలియదు.. దీంతో మళ్లీ స్టడీస్ వైపు వెళ్ళిపోయా. ఐటీ రిలేటెడ్ స్టడీస్ చేస్తున్న నేపథ్యంలో అక్కడే చదువు పూర్తి చేశాను.. ఆ సమయంలో కూడా ఎవరు నన్ను సంప్రదించలేదు.. అయితే మళ్లీ నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చాలామంది నిర్మాతలు మీకోసం అడిగాము. మీ నంబర్ దొరకలేదు అంటూ చెప్పారు.. అంటే నాకు ఆఫర్లు వచ్చాయి కానీ పి ఆర్ టీం లేకపోవడం వల్లే నా వరకు రాలేకపోయాయి అంటూ చెప్పింది. మొత్తానికైతే మధ్యలో కొంతమంది వల్ల ఈమెకు అవకాశాలు వచ్చినా రాకుండా పోయినట్లు సమాచారం..

- Advertisement -

సదా నటించిన చిత్రాలు..

ఈమె సినిమాల విషయానికి వస్తే.. ప్రాణం, దొంగ దొంగది, అవునన్నా కాదన్నా , లీలామహల్ సెంటర్, అపరిచితుడు , మైత్రి , వీరభద్ర, టక్కరి , చుక్కల్లో చంద్రుడు వంటి చిత్రాలలో నటించింది. ఇక ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చి పలుషోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు