Heroines Conditions: ఏవండోయ్.. ఈ హీరోయిన్స్ షరతులు విన్నారా.. ?

Heroines Conditions.. సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే అవకాశాలు అందుకోవడానికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎవరు ఏం చెప్పినా చేసేస్తారు.. అయితే ఒక్కసారిగా అదృష్టం వరించి.. తమ ఫేట్ మారిపోతే అవకాశం ఇచ్చిన వారిని కూడా శాసించే స్థాయికి ఎదుగుతారు సెలబ్రిటీలు అనడంలో సందేహం లేదు.. ఇప్పటికే తమకు అవకాశాలు ఇచ్చిన ఎంతో మంది దర్శక నిర్మాతలకు ఇప్పుడు గుర్తింపు వచ్చిన తర్వాత వారిని ఇబ్బంది పెడుతూ రాక్షసానందం పొందుతున్నారు కొంతమంది సెలబ్రిటీలు.. ఇదిలా ఉండగా ముఖ్యంగా భారీ పాపులారిటీ సొంతం చేసుకొని ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్న కొంతమంది హీరోయిన్స్ తాము సినిమాలలో నటించాలి అంటే ఆ సినిమా దర్శక నిర్మాతలకు కొన్ని షరతులు విధిస్తూ చుక్కలు చూపిస్తున్నారు.. ఇక మరి ఈ హీరోయిన్స్ షరతులు వింటే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. మరి ఏ హీరోయిన్ ఎలాంటి షరతు విధిస్తోందో ఇప్పుడు చూద్దాం.

నయనతార..

ఒకప్పుడు పారితోషకం విషయంలో డిమాండ్ చేస్తూ భారీ స్థాయిలోనే పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ ఇప్పుడు సినిమాలలో నటించాలంటే మరికొన్ని షాకింగ్ షరతులు విధిస్తూ ఉండడం గమనార్హం.. ఇక అలాంటి వారిలో స్టార్ హీరోయిన్ నయనతార ప్రథమ స్థానంలో ఉంటారు.. ఎంత పెద్ద సినిమాలో నటించినా సరే ఆ సినిమా ప్రమోషన్స్ కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హాజరుకారు. ఎంత రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా సరే.. ప్రచారానికి మాత్రం దూరంగా ఉంటారని అందరికీ తెలిసిందే.

- Advertisement -

త్రిష..

మరో హీరోయిన్ త్రిష.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన ఈమె మళ్లీ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకొని తిరిగి పూర్వ వైభవాన్ని అనుభవిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఈమె కూడా సాయంత్రం 6 గంటల తర్వాత మేకప్ వేసుకోవడానికి అసలు ఇష్టపడరు అని సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి..

సోనాక్షి సిన్హా..

ఇకపోతే దర్శక నిర్మాతలకు షరతులు పెడుతున్న హీరోయిన్స్ లో సోనాక్షి సిన్హా కూడా ఒకరు.. ఈమె బోల్డ్ రోల్స్ లో అసలు నటించనని తేల్చి చెబుతున్నారు.. తెరపై బోల్డ్ సీన్స్ లో తాను నటించే ఛాన్స్ వచ్చినా సరే.. అది ఎంత పెద్ద సినిమా అయినా వదులుకుంటానని స్పష్టం చేస్తోంది.. నటిగా 35 సినిమాల అనుభవం ఉంది.. ఇన్ని సినిమాల అనుభవం ఉన్నా కూడా ఈమె మాత్రం బోల్డ్ సీన్స్ చేయనని కరాకండిగా చెబుతోంది.. అంతేకాదు లిప్ కిస్ సన్నివేశాలలో, శృంగార సన్నివేశాలలో నటించలేదనే బాధ మాత్రం తనలో ఎప్పటికీ రాదు అని కామెంట్లు చేయడం గమనార్హం. పైగా తాను చెప్పిన తర్వాత దర్శక నిర్మాతల ఇష్టమని.. వారికి ఇష్టం ఉంటేనే తనను హీరోయిన్గా తీసుకోవాలని కూడా చెబుతోంది సోనాక్షి .. దబాంగ్ సినిమా తర్వాత కెరియర్ మొదలు పెట్టిన ఈమె.. కెరియర్ పరంగా వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు.. ఇక అలా కొంతమంది హీరోయిన్స్ దర్శక నిర్మాతలకు షరతులు పెడుతూ చుక్కలు చూపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు