Heroines: ఈ హీరోయిన్స్ తో జర భద్రం గురూ.. ఏమైందంటే..?

Heroines.. ఏ ఇండస్ట్రీలో నైనా సరే హీరోయిన్స్ అన్ని భాషలలో రాణించాలని చాలా కోరికతో ఉంటూ.. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు సైతం వేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. అయితే కొంతమంది హీరోయిన్స్ తో సినిమాలు ఒప్పుకున్న తర్వాత చాలామంది దర్శక నిర్మాతలకు ఇబ్బందులు ఏర్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లతో సినిమాలు ఒప్పుకుంటే ఏర్పడేటువంటి పరిస్థితుల గురించి తెలుసుకుందాం.

Heroines: What happened with these heroines?
Heroines: What happened with these heroines?

1). జాన్వీ కపూర్:

బాలీవుడ్లో పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ అలనాటి హీరోయిన్ శ్రీదేవి పెద్ద కుమార్తె.. ప్రస్తుతం తెలుగులో దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నది. అలాగే ఎన్నో చిత్రాలకు కూడా తన డేస్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది .. ప్రస్తుతం ఈమె దగ్గర కొన్ని సంవత్సరాల పాటు సినిమా డేట్లు ఖాళీగా లేవని తెలుస్తోంది. రామ్ చరణ్ తో తెలుగులో మరొక సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే నానితో కూడా ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా సన్నీ సంస్కారికి తులసి కుమారి సినిమా చేస్తోంది. ఇక ఇంత బిజీ గా వున్న జాన్వీతో సినిమా చేయాలి అంటే మరో కొంతకాలం ఆగాల్సిందే.. ఒకవేళ ఈమెతో గనుక డేట్స్ తీసుకుంటే సినిమా వాయిదా పడినట్టే..

- Advertisement -

2). మీనాక్షి చౌదరి:
గుంటూరు కారం సినిమా తర్వాత ఈమె క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం విజయ్ దళపతి తో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే చిత్రంలో నటిస్తున్నది.. అలాగే దుల్కర్ సల్మాన్ తో కూడా లక్కీ భాస్కర్.. వరుణ్ తేజ్ తో మట్కా సినిమా, విశ్వక్సేన్ తో ఒక సినిమాలో నటిస్తూ ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో ఈమె మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా కనిపించడం లేదు. అలాగే చిరంజీవితో విశ్వంభర సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

3). ప్రియాంక మోహన్:
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రంతో పాటు నాని నటిస్తున్న సరిపోదా శనివారం అనే సినిమాలో కూడా నటిస్తోంది. అలాగే తమిళంలో కూడా జయం రవి తో ఒక సినిమా చేయడమే కాకుండా అక్కడే మరో మూడు ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.. దీన్నిబట్టి చూస్తే మరో రెండు మూడేళ్లపాటు.. ఈమె డేట్లు ఖాళీగా లేవని తెలుస్తోంది.

4). భాగ్యశ్రీ బోర్సే:
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాలో నటిస్తున్నది.. ఈమెకు ఇది మొదటి సినిమానే అయినా ఈ సినిమా విడుదల అవ్వకముందే ఈ హీరోయిన్ ని చాలామంది తమ సినిమాలో నటించేలా ప్లాన్ చేసుకున్నారట. ముఖ్యంగా గౌతమ్ తిన్ననూరి , విజయ్ కాంబినేషన్లో వస్తున్న సినిమాలో తీసుకున్నారట.. అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేస్తున్న ఒక సినిమాలో కూడా ఈమెని కీలకమైన పాత్ర కోసం తీసుకున్నట్టు సమాచారం. దీన్నిబట్టి చూస్తే ఈమె చేతిలో కూడా దాదాపుగా 2 ఏళ్లపాటు సినిమాలు ఉండేలా కనిపిస్తున్నాయి.

5). రష్మిక..

ఇక స్టార్ హీరోయిన్ రష్మిక విషయానికి వస్తే పుష్ప-2 , ధనుష్ఠ కుబేర్, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో చిత్రాలు చేయడమే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇలా ప్రస్తుతం పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరోయిన్ లందరూ కూడా కొత్త సినిమాలు చేయాలి అంటే.. కచ్చితంగా రెండు నుంచి మూడు ఏళ్ల సమయం పడుతుందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు