Highest – Grossing in 10 days: అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 10 మూవీస్..!

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు భారీ బడ్జెట్తో తెరకెక్కి అంతకుమించి కలెక్షన్లు వసూలు చేసి రికార్డు సృష్టించాయి. మరి ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాలలో విడుదలైన పది రోజుల్లోనే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ -10 గా నిలిచిన చిత్రాలను ఇప్పుడు చూద్దాం..

Highest - Grossing in 10 days: Top 10 movies with highest collections..!
Highest – Grossing in 10 days: Top 10 movies with highest collections..!

1. కల్కి 2898AD(2024):

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు రూ.600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం కల్కి 2898AD.. మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా విడుదలైన తొలి పది రోజుల్లోనే రూ.825 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి.. నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది.

- Advertisement -

2.ఆర్ ఆర్ ఆర్ (2022):

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన చిత్రం ఆర్ ఆర్ ఆర్.. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకుంది.. ఈ సినిమా విడుదలైన పది రోజుల్లోనే రూ.744.5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

3. బాహుబలి 2(2017):

ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్, దగ్గుబాటి రానా కాంబినేషన్లో వచ్చిన మరో మల్టీస్టారర్ మూవీ బాహుబలి.. ఈ సినిమా సీక్వెల్ బాహుబలి 2 2017 లో వచ్చి.. విడుదలైన 10 రోజుల్లోనే ఏకంగా రూ.736.12 కోట్లు వసూలు చేసింది.

4. కే జి ఎఫ్ : చాప్టర్ 2 (2022):

ప్రముఖ కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. కన్నడ హీరో యష్ హీరోగా తెరకెక్కిన చిత్రం కేజిఎఫ్.. ఈ సినిమా సీక్వెల్ గా వచ్చిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసింది.. అంతే కాదు విడుదలైన పది రోజుల్లోనే రూ.639.5 కోట్లు వసూలు చేసి నాలుగవ స్థానాన్ని దక్కించుకుంది.

5. సలార్ (2023):

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సలార్.. గత ఏడాది విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.. అంతే కాదు విడుదలైన 10 రోజుల్లోనే రూ.634.2 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.

6. పఠాన్ (2023):

సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ రీయంట్రీ లో నటించిన చిత్రం పఠాన్.. ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాదు కలెక్షన్ల కోత కోసింది.. విడుదలైన 10 రోజుల్లోనే రూ.629.2 కోట్లు వసూలు చేసింది.

7. జవాన్(2023):

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం జవాన్.. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. అంతేకాదు విడుదలైన పది రోజుల్లోనే రూ.623.5 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది.

8. లియో (2023):

కోలీవుడ్ దళపతి విజయ్ హీరోగా.. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో త్రిష హీరోయిన్ గా వచ్చిన చిత్రం లియో.. ఈ సినిమా కూడా విడుదలైన 10 రోజుల్లోనే రూ.615.2 కోట్లు వసూలు చేసింది.

9. ఆది పురుష్ (2023):

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో.. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన చిత్రం ఆది పురుష్.. ఈ సినిమా కలెక్షన్ల పరంగా బాగానే రాబట్టిన కథపరంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే రూ .608.5 కోట్లు రాబట్టి 9వ స్థానాన్ని దక్కించుకుంది.

10). ధూమ్ 3 (2013):

విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం ధూమ్ 3. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అంతేకాదు విడుదలైన పది రోజుల్లోనే రూ.586.6 కోట్లు వసూలు చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు