HIT 3 : నాని సినిమాలో సైకో కిల్లర్‌గా టాలీవుడ్ టాప్ హీరో..?

HIT 3.. హిట్ సినిమాల పరంపర కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశ్వక్ సేన్ హీరోగా మొదలైన హిట్ ఫ్రాంచైజీ ఆ తర్వాత అడివి శేషు హీరోగా వచ్చిన హిట్ 2 కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు త్వరలో హిట్ 3 కి కూడా రంగం సిద్ధం కాబోతోంది.. ఇప్పుడు ఈ హిట్ ఫ్రాంచైజీని నాని తన పాత్రతో కొత్తగా మరో లెవెల్ కి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. హిట్ మరియు హిట్ 2 చిత్రాలతో నిర్మాతగా తన ప్రతిభను నిరూపించుకున్న ఈయన ఇప్పుడు హిట్ 3 లో అటు హీరోగా, ఇటు నిర్మాతగా కూడా వ్యవహరించనున్నారు. శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో నానికి టాలీవుడ్ పవర్ఫుల్ నటుడు ప్రతినాయకుడిగా నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

HIT 3 : Tollywood's top hero as a psycho killer in the movie Nani..?
HIT 3 : Tollywood’s top hero as a psycho killer in the movie Nani..?

హిట్ 3 కి సర్వం సిద్ధం..

ప్రముఖ డైరెక్టర్ శైలేష్ కొలను ఇదివరకే కథ మొత్తం సిద్ధం చేయగా.. నాని కూడా ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్ పైకి వెళ్తుంది అనే విషయంలో అభిమానులు సైతం ఆసక్తి కనబరిచారు.. కానీ ఇంకా క్లారిటీ లేదు.. ప్రస్తుతం నాని సరిపోదా శనివారం అనే సినిమాలో బిజీగా ఉండగా.. శేఖర్ కమ్ములతో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాలతో పాటు దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో కూడా మరో సినిమా చేయడానికి నాని సిద్ధమవుతున్నారట.. ఈ ప్రాజెక్టులు ఒకవైపు జరుగుతూ ఉండగానే..మధ్యలో ఖాళీ సమయం దొరికినప్పుడు ఈ సినిమాను పూర్తి చేయాలని నాని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

సైకో కిల్లర్ గా రానా..

హిట్ సినిమాల విషయానికి వస్తే… ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉండి .. సైకో కిల్లర్ ను పట్టుకోవడంలో హీరో కీలకపాత్ర పోషిస్తాడు.. ఈ ఫార్మాట్ ప్రకారం హిట్ 3 లో టాలీవుడ్ స్టార్ నటుడు సైకో కిల్లర్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. మరి ఎవరా టాలీవుడ్ స్టార్ హీరో అనే విషయానికొస్తే.. ఆయన ఎవరో కాదు పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమా ద్వారా బల్లాలదేవ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్న రానా దగ్గుబాటి అని సమాచారం.. ఇకపోతే నాని – రానా మధ్య మంచి స్నేహబంధం ఉంది. ఇంతకుముందు వీరిద్దరూ ఒక అవార్డు వేడుకకు కలిసి హోస్ట్ గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు ఇద్దరూ కలిసి స్క్రీన్ పై పోటీ పడబోతున్నారు అని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు స్నేహితులు, శత్రువులుగా మారితే ఎలా ఉంటుందో చూడాలని అభిమానుల సైతం ఆసక్తి కనబరుస్తూ ఉండడం గమనార్హం.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

- Advertisement -

నాని కెరియర్ లో మైలురాయి..

అంతేకాదు ఈ సినిమా నాని కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలవడనుంది అని సమాచారం. మరొకవైపు శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో చాలామంది స్టార్ యాక్టర్స్ భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు