Actor Johnny Wactor : తెల్లవారుజామున అమెరికాలో దారుణం… హాలీవుడ్ నటుడ్ని కాల్చి చంపిన దుండగులు

Actor Johnny Wactor : అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. ఓ హాలీవుడ్ నటుడు ప్రయాత్నిస్తున్న కారుపై కొంత మంది కాల్పులు జరిపారు. దీంతో ఆ హాలీవుడ్ నటుడు అక్కడిక్కడికే మరణించాడు. ఈ కాల్పులకు కారణం…? ఏంటి హత్య చేయబడ్డ ఆ నటుడు ఎవరో ఇప్పుడు చూద్ధాం..

అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో అమెరికాలో గన్ తో జరిగిన హత్యలు చాలా చూశాం. తాజాగా హాలీవుడ్ నటుడు జానీ వాక్ట‌ర్ (37) పై గుర్తు తెలియన దుండగులు దాడి చేశారు.

శనివారం శనివారం తెల్లవారు జామున అమెరికాలోని లాస్ ఏంజిల్స్ డౌన్‌టౌన్‌ నగరంలో ఈ దారుణం జరిగింది. శనివారం జానీ వాక్టర్ తన కారులో ప్రయాత్నిస్తున్న టైంలో ముగ్గురు దుండగులు వచ్చి కారును దోపిడి చేసి, జానీ వాక్టర్ పై గన్స్ తో కాల్పులు జరిపారట. దీంతో జానీ వాక్టర్ అక్కడిక్కడే చనిపోయాడుని వాక్ట‌ర్ త‌ల్లి స్కార్లెట్ మీడియాకు తెలిపింది. కాగా, దాడి సమయంలో జానీ వాక్టర్ తో కారులో స‌హొద్యోగి ఒక్కరే ఉన్నారని ఆమె తెలిపింది.

- Advertisement -
Hollywood actor Johnny Walker was shot dead with guns
Hollywood actor Johnny Walker was shot dead with guns

కాగా, జానీ వాక్టర్… తన కెరీర్ ను లైఫ్‌టైమ్ డ్రామా సిరీస్ ఆర్మీ వైవ్స్ అనే టీవీ సిరీస్ తో ప్రారంభించాడు. 2007లో వచ్చిన ఈ షో చాలా పాపులారిటీని సంపాదించుకుంది. దీని తర్వాత జానీకి చాలా అవకాశాలు వచ్చాయి. క్రిమినల్ మైండ్స్, హాలీవుడ్ గర్ల్, ది ఓ లాంటి ఎన్నో వెబ్ సిరీస్ లు జానీని స్టార్ గా నిలబెట్టాయి. జానీ వాక్టర్ కెరీర్ లో ది బెస్ట్ అంటే జనరల్ హాస్పటల్ షో అనే చెబుతారు. దాదాపు 200 ఎపిసోడ్స్ లో నటించిన జానీకి అందులో ఉన్న క్యారెక్టర్ తోనే బయటి కూడా పిలవడం స్టార్ట్ చేశారంటే, ఈ జనరల్ హాస్పటల్ షో ఈయనకు ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో అర్థం చేసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు