Honey Rose : అబ్బా.. ఇంత అందాన్ని తట్టుకోవడం కష్టమే మామా..!

Honey Rose.. మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ గురించి.. ఆమె అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అంతే కాదు ఈమె అందాలను వర్ణించడానికి కవిత్వం కూడా చిన్నబోతుందేమో.. పిల్లి కళ్ళ సుందరి.. లేలేత బుగ్గల తో అంతకుమించి అందాన్ని ఒలకపోస్తూ హార్ట్ గ్లామర్ తో యువతకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది.. ఇక ఈమె అందాలను చూసి తట్టుకోవడం అంత మామూలు విషయం కాదు.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఉక్కిరిబిక్కిరి చేసే హనీ రోజ్.. తాజాగా మరోసారి షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ళ గుండెల్లో అలజడులు రేకెత్తాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె షేర్ చేసిన మరో ఫోటోషూట్ చూస్తే నిజంగా కళ్ళు బయర్లు కమ్ముతాయని చెప్పవచ్చు.

విశాఖలో సందడి చేసిన హనీ రోజ్..

Honey Rose : Wow.. It's hard to resist such beauty, mama..!
Honey Rose : Wow.. It’s hard to resist such beauty, mama..!

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. తాజాగా విశాఖలో ఈమె సందడి చేసింది. జె స్టూడియో ప్రారంభానికి వచ్చిన హనీ రోజ్ విశాఖ అంటే తనకు చాలా ఇష్టమని.. తనకు ఎంతో అనుబంధం ఉందని కూడా తెలిపింది. జె స్టూడియో గురించి ప్రస్తావిస్తూ.. . హెయిర్ స్టైల్, లేడీస్ మేకప్ మంచి క్వాలిటీ, బ్యూటిఫుల్గా విశాఖలో జే స్టూడియో అందిస్తుందని ఆమె తెలిపారు.. దీంతో పాటు ఆయుర్వేదిక్ మసాజ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉందని.. తన చేతుల మీదుగా ప్రారంభించిన ఈ జే స్టూడియోలో హెయిర్ కట్, లేడీస్ మేకప్ వాటిపై ప్రస్తుతం 30 పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉందని తెలిపింది హనీ రోజ్.. అలాగే విశాఖ ప్రజలందరూ కూడా జే స్టూడియోని ఆదరించాలని.. తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం తనకు చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపింది. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన హనీ రోజ్ ను అక్కడివారు కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక అంతే ఈమె అందాలు చూసి అందరూ మైమరిచిపోతున్నారు.

బ్లాక్ కలర్ శారీలో మంత్రముగ్ధుల్ని చేస్తున్న హనీ రోజ్..

బ్లాక్ కలర్ సారీ లో స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఉంగరాలలా రింగులు తిరిగిన జుట్టును.. సైడ్ కు సరిచేసుకొని.. ముత్యాలు పొదిగిన ఇయర్ రింగ్స్ ధరించి.. సైడ్ కి చెవి దగ్గర ఎల్లో కలర్ రోజ్ ధరించి.. తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకుందని చెప్పాలి. ఈ లేత బుగ్గల సుందరి వయ్యారాలకు , సొగసులకు యువత మంత్రముగ్ధులవుతున్నారు. మొత్తానికి అయితే హనీ రోజ్ అందాన్ని చూసి అభిమానులు సైతం తట్టుకోలేకపోతున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

బాలయ్య మూవీ తోనే గుర్తింపు..

ఇక హనీ రోజ్ కెరియర్ విషయానికి వస్తే.. 2005లో మలయాళంలో విడుదలైన బాయ్ ఫ్రెండ్ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. ఇక తర్వాత మలయాళం తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా నటించింది.. తెలుగులో మొదటిసారి ఆలయం, ఈ వర్షం సాక్షిగా వంటి సినిమాలలో నటించింది కానీ పెద్దగా గుర్తింపు లభించలేదు. కానీ బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో హీరోయిన్ గా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఇక అప్పటినుంచి బాలయ్య హీరోయిన్ గా ముద్ర వేయించుకున్న ఈమె ఇక ఎక్కువగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ కి వెళ్తూ భారీ పాపులారిటీ దక్కించుకోవడమే కాదు అంతకుమించి సంపాదిస్తోంది కూడా.

 

View this post on Instagram

 

A post shared by Honey Rose (@honeyroseinsta)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు