Indian 2 : ఇండియన్ 2 సినిమాలో ఎస్ జె సూర్య కు అవకాశం ఎలా వచ్చిందంటే.?

Indian 2 : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ఎస్ జె సూర్య ఒకరు. అయితే నటుడి కంటే ముందు ఎస్ జె సూర్య ఒక దర్శకుడిగా చాలామందికి పరిచయం. ఎస్ జె సూర్య దర్శకుడుగా కూడా మంచి హిట్ సినిమాలును అందుకున్నాడు. కేవలం తమిళ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య పరిచయం. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషి సినిమాని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది. ఇకపోతే తెలుగులో నాని అని మహేష్ బాబు తో ఒక సినిమాను తెరకెక్కించాడు సూర్య. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ మహేష్ బాబుకి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. మళ్లీ ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో కొమరం పులి అని ఒక సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది.

నటుడుగా గుర్తింపు

ఇక రీసెంట్ టైమ్స్ లో ఎస్ జె సూర్య నటుడుగా కూడా నిలదొక్కుకుంటున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు సూర్య. అలానే మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక విలన్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమాతో సూర్యకి మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా వస్తున్న తమిళ్ సినిమాల్లో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

INDIAN 2

- Advertisement -

ఇండియన్ 2 సినిమాలో విలన్ గా

ఇండియన్ 2 సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కమలహాసన్ కి సూర్య కి మధ్య సీన్స్ చాలా హైలెట్ గా ఉండబోతున్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాకి అవకాశం ఎలా వచ్చిందో రీవీల్ చేశాడు ఎస్ జె సూర్య. శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాలో ఒక కీలక పాత్ర చేశాడు సూర్య. అయితే ఆ సినిమాకు సంబంధించి సూర్య పర్ఫామెన్స్ చూసి ఇండియన్ 2 సినిమాలో అవకాశం ఇచ్చాడు శంకర్. ఇండియన్ టు సినిమా కంటే కూడా ఇండియన్ 3 సినిమాలో ఎస్ జె సూర్య కి కమల్ హాసన్ కి మధ్య కీలకమైన సన్నివేశాలు ఉంటాయంటూ ఒక ఇంటర్వ్యూలో రీవీల్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు