Ee Nagaraniki Emaindi: రీరిలీజ్ కి ఈ రేంజ్ కలెక్షన్స్ ఎలా సాధ్యం..!

టాలీవుడ్లో రీరిలీజ్ ల ట్రెండ్ ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఇప్పటిదాకా స్టార్ హీరోల సినిమాలు ఏదో ఒక అకేషన్ ని బేస్ చేసుకొని రీరిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఏ సందర్భం లేకుండా విశ్వక్ సేన్ నటించిన ఈ నగరానికి ఏమైంది సినిమా రీరిలీజ్ అయ్యి ఓపెనింగ్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. రిలీజ్ కి ముందు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే జోరు చూపించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోతోంది. మొదట రిలీజ్ అయినప్పటికంటే ఇప్పుడు ఎక్కువ ఓపెనింగ్స్ ని రాబట్టింది ఈ సినిమా. జూన్ 29న ఈ సినిమా రీరిలీజ్ చేయగా అదే రోజున రిలీజ్ అయిన పలు చిన్న సినిమాల కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇప్పటిదాకా రీరిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయంటే, వాళ్లకున్న క్రేజ్ కారణం అనుకోవచ్చు కానీ, ఒక్క స్టార్ హీరో కూడా లేని ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా రీరిలీజ్ కి కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తున్నాయంటే అది కేవలం కంటెంట్ కి ఉన్న పవర్ అని చెప్పచ్చు. ఈ సినిమా రిలీజ్ సమయానికి కొత్త హీరోగా మాత్రమే గుర్తింపు ఉన్న విశ్వక్ సేన్ ఆ తర్వాత ‘ఫలక్నామ దాస్’, ధమ్కీ వంటి సినిమాలతో హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ కావటంతో వచ్చిన క్రేజ్ కూడా  ఈ రేంజ్ కలెక్షన్స్ కి కారణం అని చెప్పచ్చు.
అప్పట్లో కేవలం యూత్ మాత్రమే ఆదరించిన ఈ సినిమాలోని కొన్ని సీన్లు ఆ తర్వాత సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో తెగ వైరల్ అయ్యాయి. సినిమా కథ ప్రతి యువకుడి జీవితంలో జరిగే సంఘటనలతో నిండి ఉండటంతో చాలా మంది రిపీట్ మోడ్ లో చూశారు ఈ సినిమాను. సినిమా అంతా ఎంటర్టైనింగ్ గా సాగినప్పటికీ ఎండింగ్ లో లైఫ్ గురించి ఇచ్చే మెసేజ్ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యింది. మొత్తానికి రీరిలీజ్ ద్వారా మంచి వసూళ్లు రాబడుతున్న ఈ సినిమా కంటెంట్ కి ఉన్న పవర్ ఏంటో నిరూపించిందని చెప్పాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు