Akkineni Family: ఇంకెంత కాలం ఈ గడ్డు కాలం?

టాలీవుడ్ సినిమా పాన్ ఇండియా సినిమా గా విస్తరిస్తుంది. టాలీవుడ్ లో దాదాపు అన్ని ఫ్యామిలీ ల నుంచి బడా ప్రాజెక్టులు వస్తున్నాయి. భారీ హిట్లు కొడుతూ తమ రేంజ్ ని పెంచుకుంటూ అలాగే వారి కుటుంబ ప్రతిష్టను పెంచుతున్నారు. కానీ తెలుగు ఇండస్ట్రీని ఏలిన ఒక ఫ్యామిలీ మాత్రం ఇప్పుడు తమ పరువును కాపాడుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుంది. అదే అక్కినేని ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీకి టాలీవుడ్ లో ఒకప్పుడు హై రేంజ్ లో డిమాండ్ ఉండేది. అక్కినేని నాగేశ్వరరావు తో మొదలైన వీరి వంశం అక్కినేని అఖిల్ వరకు వచ్చింది.

అయితే వేరే హీరోల ఫ్యామిలీ లాగా అక్కినేని ఫ్యామిలిలో ఎక్కువమంది స్టార్స్ కాలేకపోయారు. ఒకప్పుడు ఎన్టీఆర్ తో సమానంగా తన స్థాయిని నిలుపుకుని ఆయన కంటే ఎక్కువ ఇండస్ట్రీ హిట్లు కొట్టారు ఏఎన్ఆర్. ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ కన్నా ముందే ఇండస్ట్రీ కి వచ్చి కొన్నేళ్లు నెంబర్ వన్ హీరోగా ఉన్నారు ఏఎన్ఆర్. అయితే ఆయన స్థాయిలో మాత్రం అక్కినేని వారసులు లెగసి ని కంటిన్యూ చేయలేకపోయారు. ఉన్నంతలో అక్కినేని నాగార్జున రెండవతరం స్టార్ గా టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగాడు.

అయితే ఇప్పుడు నాగార్జున కూడా మార్కెట్ పరంగా పూర్తిగా వెనకబడిపోయాడు. తన సహనటులైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తమ దైన శైలిలో సినిమాలు చేస్తూ, హిట్స్ కొడుతూ మార్కెట్ ను పెంచుకుంటున్నారు. ఈయన మాత్రం ఒకే మూసధోరణి లో లవ్ స్టోరీస్, యాక్షన్ మూవీస్ చేస్తూ తన స్థాయిని దిగజార్చుకున్నారు. ఆ మధ్య మన్మధుడు 2 సినిమాలో బోల్డ్ సీన్లలో నటించి విమర్శలపాలయ్యాడు. రీసెంట్ గా వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ సినిమాల్తో డిజాస్టర్లు అందుకున్నాడు. ఉన్నంత లో బంగార్రాజు పర్వాలేదనిపించినా అది నాగార్జున స్థాయి సినిమా కాదు.

- Advertisement -

ఇప్పుడు నాగార్జున నట వారసులైన నాగ చైతన్య, అఖిల్ పరిస్థితి కూడా అధోగతిగా మారింది. స్టార్ హీరోలుగా ఇండస్ట్రీని ఏలుతారనుకున్న ఇద్దరూ తమ మార్కెట్ కాపాడుకోవడానికే తిప్పలు పడాల్సి వస్తుంది. కొన్నేళ్ళవరకు సెలక్టివ్ గా మంచి సినిమాలు చేస్తూ వచ్చిన నాగ చైతన్య కూడా రీసెంట్ గా వచ్చిన తన మూవీల ఫలితాలతో దెబ్బ తిన్నాడు. లాక్ డౌన్ ముందు టైర్ 2 హీరోల్లో నెంబర్ వన్ గా ఉన్నాడు నాగ చైతన్య. ఇప్పుడు తన సినిమాల ఫలితాలను చూస్తే, మార్కెట్ ఉందొ లేదో కూడా తెలియట్లేదు. “థ్యాంక్ యు” మూవీ తో కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకున్న “చై” రీసెంట్ గా “కస్టడీ” సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా కూడా మిశ్రమ స్పందన తెచ్చుకొని ప్లాప్ దిశగా వెళ్తుంది. ఎంత సిన్సియర్ గా కష్టపడినా చైతన్య కి హిట్ పడడం లేదు.

ఇక అయ్యగారు అని అక్కినేని ఫ్యాన్స్ పిలుచుకునే అఖిల్ పూర్తి భిన్నం. నాగార్జున, నాగ చైతన్య అడపాదడపా అప్పుడప్పుడైనా హిట్లు కొట్టారు. కానీ అఖిల్ కి మాత్రం కెరీర్లో ఒకే ఒక్క హిట్టు సినిమా ఉంది. అదే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. 2015లో “అఖిల్ ది పవర్ అఫ్ జువా” తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అంతే గ్రాండ్ గా డిజాస్టర్ అయ్యింది ఆ సినిమా. ఆ తర్వాత చేసిన ఈ సినిమాలు హిట్ కాలేదు. ఎదో కొసమెరుపులా లాక్ డౌన్ లో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో మోస్తరు హిట్ వచ్చినా దాని వల్ల అఖిల్ కెరీర్ కి ఒరిగిందేమి లేదు. తాజాగా “ఏజెంట్” గా వచ్చి కెరీర్ లో మరోసారి బిగ్గెస్ట్ డిజాస్టర్ ను అందుకున్నాడు అఖిల్.

ఒకప్పుడు 7 ఇండస్ట్రీ హిట్లు కొట్టిన తొలి తరం హీరోగా అక్కినేని నాగేశ్వరరావు తన రేంజ్ ని నిలుపుకుంటే, ఆయన వారసులుగా వచ్చి ఒక్క హిట్టు కోసం చాలా కష్టపడాల్సి వస్తుంది ఈ అక్కినేని హీరోలకి. ఇప్పటికైనా తమ ఫ్యామిలీకి అచ్చొచ్చాయంటూ మూస ధోరణి లాగా రొమాంటిక్ లవ్ స్టోరీలే కాకుండా ట్రెండ్ కి తగ్గట్టు మంచి స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకుని అక్కినేని కుటుంబ పరువును కాపాడుకుంటే మంచిది.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు