War2 : హృతిక్, తారక్ బర్త్ డే ట్వీట్స్ లో హింట్ బాగానే ఇచ్చారే!

War2 : యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే (మే 20) సందర్భంగా సోషల్ మీడియాలో సెలెబ్రిటీల నుండి అభిమానుల దాకా గ్రాండ్ గా విష్ చేసారని తెలిసిందే. ఇక అభిమానులయితే దేవర నుండి విడుదలైన ఫియర్ సాంగ్ ప్లే చేస్తూ ఎన్టీఆర్ బర్త్ డే సెలెబ్రేట్ చేశారు. ఇక ఎన్టీఆర్ సహా నటులు స్నేహితులు కూడా బర్త్ డే సందర్బంగా తమ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విష్ చేసారు. రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాల ద్వారా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ అందచేశారు. ఇక సాయంత్రం బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్ కి ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ చెప్పాడు. అయితే మామూలుగా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పకుండా బర్త్ డే విషెస్ తో పాటు వీరి మూవీ గురించి హింట్ ఇచ్చారు. అదేదో కోడ్ లాంగ్వేజ్‌లోనే వీళ్ళ పలకరింపులు సాగాయి. ఆ ట్వీట్ లో స్టూడెంట్స్ అని? టీచర్ అని? పదాలు వాడేసరికి జనాలు కొంతమంది అర్ధం చేసుకోలేదు గాని, ట్రేడ్ పండితులు మాత్రం తమ సినిమా గురించి బహుశా క్లూ ఇచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇక వీరిద్దరూ కలిసి వార్2 (War2) లో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

Hrithik gave War 2 hint in Jr NTR's birthday wishes

బర్త్ డే విషెస్ లో హింట్!

ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కలిసి వార్2 చిత్రంలో లో నటిస్తున్న విషయం తెలిసిందే. వార్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో వీరిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోతాయట. ఇక ఈ ఇద్దరి కాంబోలోనూ ఓ పాటను కూడా ప్లాన్ చేశారు. ‘నాటు నాటు’ తరహాలో ఆ సాంగ్ ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇండియాలో ది బెస్ట్ డ్యాన్సర్స్ లో ఈ ఇద్దరు కూడా ముందు వరుసలో ఉంటారు. స్ప్రింగులా డ్యాన్సులు చేసే ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ మీద స్టెప్పులు వేస్తే ఇండియాలోనే ట్రెండ్ సెట్టర్ అవుతుందని అంటున్నారు నెటిజన్లు. అయితే వార్ 2లో ఈ పాట మీద ఇప్పటి వరకు ఊహగానాలు మాత్రమే వినిపించాయి. అయితే తాజాగా ఎన్టీఆర్‌‌కు విషెస్ చెబుతూ హృతిక్ వేసిన ట్వీట్‌తో ఏదో హింట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ఆ హింట్ ఈ సాంగ్ గురించేనా? అన్న చర్చలు మొదలయ్యాయి. ఏదో కోడ్ లాంగ్వెజ్‌లో సింపుల్ గా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది.

- Advertisement -

మాస్ స్టెప్పులు గ్యారెంటీ..

ఇక హృతిక్ రోషన్ తన ట్వీట్ లో “హ్యాపీ బర్త్ డే తారక్” అని చెబుతూనే “స్పిన్ అరౌండ్ ది సన్” అని అన్నాడు. ఈ సారి మనిద్దరం కలిసి స్పిన్ చేస్తామని చెప్పుకొచ్చాడు. ఆ స్పిన్ కంప్లీట్ అయ్యేలోపు.. ఈ స్టూడెంట్లను చూసి కిచెన్‌ లో మాస్టర్ గర్విస్తాడని ఆశిద్దామని అన్నాడు. అయితే ఈ స్పిన్ ఏంటో.. ఈ మాస్టర్ ఏంటో అని అంతా అనుకుంటున్నారు. అయితే హృతిక్‌కి ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లై కూడా అలానే ఉంది. హహ… అని నవ్వేస్తూ థాంక్యూ సర్.. అని అన్నాడు తారక్. సెట్స్‌లో మీతో అద్భుమైన వార్ జరిగింది. ఈ సారి ‘స్పిన్ అరౌండ్ ది సన్’ కోసం వెయిట్ చేస్తున్నా.. స్టూడెంట్స్ రెడీగా ఉంటే.. ‘మాస్టర్ కూడా రెడీ’ గానే ఉంటాడు. నువ్వు రెడీనా? అని తారక్ అడిగేశాడు. ఇక్కడ మాస్టర్ అనగానే డాన్స్ మాస్టర్ అని అర్ధమైపోతుంది. ఇక ఇదంతా చూస్తుంటే నెక్స్ట్ స్టార్ట్ చేసే షెడ్యూల్‌లో ఈ ఇద్దరూ కలిసి మాస్ స్టెప్పులు వేసేలా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ హృతిక్ రోషన్ సినిమా అంటే ఖచ్చితంగా డాన్స్ బీట్ ఉండాల్సిందే. లేకపోతే కిక్కేముంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు