Hrithik Roshan : అజ్ఞానం అంటూ యాపిల్ యాడ్ పై కామెంట్స్… దెబ్బకు దుకాణం బంద్

Hrithik Roshan : యాపిల్ తన కొత్త ఐఫోన్ కోసం తాజాగా విడుదల చేసిన ప్రకటన చాలామందిని నిరాశకు గురి చేసింది. ఈ కమర్షియల్ యాడ్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుండగా, తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పందించారు.

అజ్ఞానం అంటూ యాపిల్ యాడ్ పై హృతిక్ ఫైర్

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ యాపిల్ కొత్త యాడ్ పై విచారకరం అంటూ కామెంట్స్ చేశారు. హృతిక్ రోషన్ వివాదాస్పద యాపిల్ యాడ్ పై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయన ఈ యాడ్ పై తీవ్రంగా స్పందిస్తూ “కొత్త యాపిల్ యాడ్ ఎంత విచారకరం, అజ్ఞానం” అంటూ రాసుకొచ్చారు.

హృతిక్ కంటే ముందే బ్రిటీష్ నటుడు, చిత్రనిర్మాత హ్యూ గ్రాంట్ కూడా యాపిల్ కొత్త ప్రకటనపై విమర్శలు గుప్పించారు. మరో బ్రిటిష్ ప్రొడ్యూసర్ ఆసిఫ్ కూడా ఈ వాణిజ్య ప్రకటనను తప్పుబట్టారు. “ఇది అన్నీ ఐప్యాడ్‌ల మాదిరిగానే.. కానీ ఈ ప్రకటన మంచి ఆలోచన అని ఎవరు ఎందుకు అనుకున్నారో తెలియదు. టెక్ కంపెనీలు కళలకు, కళాకారులకు, సంగీతకారులకు, సృష్టికర్తలకు, రచయితలకు, చిత్ర నిర్మాతలు చేసే పనులకు ఇది అత్యంత నిజాయితీతో కూడిన రూపకం… వాటిని పిండండి, ఉపయోగించండి, బాగా చెల్లించకండి, ప్రతిదీ తీసుకోండి, ఆపై ఇవన్నీ వారిచే సృష్టించబడినవి అని చెప్పండి” అంటూ తమ కళలను అవమానిస్తున్నారు అంటూ గట్టిగానే ఇచ్చిపడేశారు ఆయన.

- Advertisement -

Apple iPhone వివాదాస్పద యాడ్ ఏంటి ?

ఈ నెల ప్రారంభంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ‘క్రష్’ పేరుతో కొత్త యాడ్ ను విడుదల చేశారు. ఆ వీడియోలో సంగీత వాయిద్యాలు, శిల్పాలు, స్పీకర్లు, పుస్తకాలు, పెయింట్ డబ్బాలు, గేమింగ్ కన్సోల్‌లతో సహా అనేక వస్తువులను అణిచివేసేందుకు ఒక పెద్ద హైడ్రాలిక్ ను వాడారు.

“కొత్త ఐప్యాడ్ ప్రోని కలవండి: M4 చిప్ అద్భుతమైన శక్తితో మేము ఇప్పటి వరకు సృష్టించిన అత్యంత సన్నని ఉత్పత్తి ఇదే. ఇప్పటి వరకు మేము రిలీజ్ చేసిన ప్రాడక్ట్స్ లో ఇదే అత్యంత అధునాతనమైన ఐప్యాడ్. దీన్ని సృష్టించడానికి ఉపయోగించబడే అన్ని విషయాలను ఊహించండి” అని టిమ్ కుక్ తన X హ్యాండిల్‌లో రాసుకొచ్చాడు.

ఇదే వివాదం..

ఐఫోన్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ యాడ్ వైరల్ కావడం, దానిపై విమర్శలు వెల్లువలా వచ్చి పడడం వెంటవెంటనే జరిగిపోయాయి. సాధారణ జనాల నుంచి సెలబ్రిటీల దాకా అందరూ ఈ యాడ్ పై దుమ్మెత్తి పోస్తున్నారు.

దెబ్బకు దుకాణం బంద్

కొత్త ఐఫోన్‌ ను అత్యంత శక్తివంతంగా, సన్నగా చూపించాలనేది కంపెనీ ఆలోచన అయినప్పటికీ ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. యాపిల్ ఈ యాడ్ ద్వారా కళలను అగౌరవపరిచిందని చాలా మంది ఆరోపించారు. మరికొందరు యాడ్ లోని “హైడ్రాలిక్ అణిచివేతకు చిహ్నం” అంటూ నిరాశను వ్యక్తం చేశారు. కంపెనీ ఈ ఊహించని ఎదురు దెబ్బను ఎదుర్కొన్న తర్వాత Apple టెలివిజన్‌లో ఈ యాడ్ ను ప్రసారం చేయకూడదని నిర్ణయించుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు