Pushpa2 : కన్నడలో ‘పుష్ప’ గాడి క్రేజ్ అస్సలు తగ్గట్లే..

Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భారీ హిట్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా రాబోతుంది.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. అయితే ఈ సినిమాను మొదట ఆగష్టు లో విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇటీవల కొన్ని కారణాల వల్ల సినిమాను డిసెంబర్ లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.. తాజాగా ఈ సినిమాకు కన్నడలో భారీగా బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది..

ఈ సినిమాకు భారీ లెవెల్లో థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టుగా గతంలో చాలా వార్తలు వినిపించాయి.. అయితే ఇపుడు కన్నడ రైట్స్ కి సంబంధించి లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీకి ఏకంగా ఒక్క కన్నడ హక్కులే 32 కోట్లకి అమ్ముడుపోయినట్టుగా టాక్ . ఇది టాలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో ఒకదానికి బిగ్గెస్ట్ డీల్ గా తెలుస్తుంది. మొత్తానికి అయితే పుష్ప 2 అపి హైప్ మామూలు లెవెల్లో లేదని చెప్పాలి.. గతంలో వచ్చిన సినిమా కన్నా ఈ సినిమాకు క్రేజ్ కాస్త ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది..

Huge business deal for Pushpa 2 in Kannada
Huge business deal for Pushpa 2 in Kannada

ఇక ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా మ్యాజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.. పుష్ప టైటిల్ సాంగ్ మాత్రం ఓ రేంజులో చక్కర్లు కొడుతుంది.. మొత్తంగా చూసుకుంటే సినిమాకు అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.. మరో రెండు నెలల్లో రిలీజ్‌ కావాల్సినా పుష్ప-2 ఊహించని విధంగా వాయిదా పడింది.. దీనిపై బన్నీ ఫ్యాన్స్ ఓ రేంజులో ఫైర్ అవుతున్నారు.. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది..  మరి ఎప్పుడన్న పుష్ప గాడు దిగుతాడా, వెనక్కి తగ్గుతాడా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు…

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు