Kiran Abbavaram : ఏదైనా చేసి హిట్ కొట్టాలి అంతే… ‘క’ మూవీ బిజినెస్ అలాగే ఉంది మరి

Kiran Abbavaram : టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ ఆరంభించి ‘రాజావారు రాణిగారు’ అనే చిన్న సినిమాతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే ఆకట్టుకోగా, SR కళ్యాణమండపం అనే సినిమాతో ఓ సక్సెస్ ని అందుకున్నాడు. ఆ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే కూడా అందించి రచయితగా తనలోని టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కిరణ్ అబ్బవరం, భారీ ప్లాప్ లను అందుకుని డీలా పడ్డాడు. కిరణ్. లాస్ట్ ఇయర్ మొదట్లో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఓ మోస్తరు సెమి హిట్ ని అందుకున్న కిరణ్ మళ్ళీ డిజాస్టర్లు అందుకున్నాడు. మంచి అంచనాలతో వచ్చిన మీటర్, రూల్స్ రంజన్ సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో సినిమాలు చేయాలనీ ఆచి తూచి అడుగులేస్తున్నాడు.

Huge offer for Kiran Abbavaram's 'Ka' movie

‘క’ తో ఎలాగైనా హిట్టు కొట్టాలని ఫిక్సయ్యాడు..

ఇక కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న మూవీ “క”. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అసలు సినిమాకి ‘క’ అనే టైటిల్ పెట్టినప్పుడు ముందుగా ట్రోల్స్ వచ్చినా ఆ తర్వాత టీజర్ చూపించి మంచి మార్కులు కొట్టేసారు మేకర్స్. ఇక ఈ సినిమాను శ్రీ చక్ర ఎంటర్టైన్మెంట్స్, కే ఏ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను సందీప్& సుజీత్ అనే ఇద్దరు దర్శకులు కలిసి డైరెక్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు అప్పుడే భారీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయి.

- Advertisement -

‘క’ కి సాలిడ్ రేటు… నిర్మాతలు రిస్క్ చేస్తున్నారా?

ఇదిలా ఉండగా కిరణ్ అబ్బవరం ‘ క’ సినిమా టీజర్ రిలీజ్ ముందు వరకు ఎలాంటి అంచనాలు లేవు. టైటిల్ రివీల్ చేసినపుడు కూడా ట్రోల్స్ వచ్చాయి. కానీ టీజర్ రిలీజ్ అయ్యాకే సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఇప్పుడు పలువురు డిస్ట్రిబ్యూటర్లు ‘క’ సినిమా కోసం నిర్మాతలకు భారీ ఆఫర్ ఇచ్చారట. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడిప్పుడే నిర్మాణ రంగంలో ఎదుగుతున్న ఓ చిన్న నిర్మాణ సంస్థ కిరణ్ అబ్బవరం “క” సినిమా కోసం తెలుగు రాష్ట్రాల హక్కులను ఏకంగా 12 కోట్ల ఆఫర్ చేసిందట. నిర్మాతలు కూడా వెంటనే డీల్ కుదుర్చుకున్నట్టు, రెండు మూడు రోజుల్లో అఫిషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంత వరకు కనీసం 10 కోట్ల మార్కెట్ కూడా లేని కిరణ్ అబ్బవరం సినిమాకి ఇంత రేటు పెట్టడం వల్ల రిస్క్ చేస్తున్నారా అన్న మాట వినిపిస్తుంది. కంటెంట్ ఎంత బాగున్నా మరి కొన్నాళ్ళు ఆగి నిర్మాతలు కూడా రేటు ఫైనల్ చేసుకుంటే మంచిదని, లేదంటే ముందు ముందు సినిమా టాక్ తర్వాత డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు క్లాష్ వచ్చే ఛాన్స్ ఉందని నెటిజన్లు అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు