HUNT: వేటకు సిద్ధమైన సుధీర్ బాబు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో సుధీర్ బాబుకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉందన్న విషయం తెలిసిందే. ఎస్ఎంఎస్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయమైన సుధీర్ బాబు ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. సుధీర్ బాబు – మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో సమ్మోహనం, వి, చిత్రాల తర్వాత ఇటీవల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు సుధీర్ బాబు. కానీ ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

కానీ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్న నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హంట్’. ‘గన్స్ డోంట్ లై’ అనేది ట్యాగ్ లైన్. భవ్య క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి మహేష్ సురపతినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా యువ దర్శకుడు మహేష్ టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు.

ఈ చిత్రంలో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫెమ్ భరత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నుండి ఇప్పటికే పలు అప్డేట్స్ ఇస్తూ సినిమా పై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానున్నట్లు నిర్మాత వెల్లడించారు.

- Advertisement -

ఈ సినిమా విడుదల తేదీన ప్రకటించిన సందర్భంగా నిర్మాత వి ఆనందప్రసాద్ మాట్లాడుతూ.. ” హంట్ మూవీ రిపబ్లిక్ డే కానుకగా ప్రేక్షకులు అందరినీ అలరిస్తుంది. ఈ మూవీ చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. మార్వెల్ స్టూడియో నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రెనాడ్ ఫవేరో, బ్రయాన్ విజియర్ ఈ చిత్రంలో స్టంట్స్ కంపోజ్ చేశారు. వీళ్ళ యాక్షన్ కొరియోగ్రఫీ సినిమాకి హైలైట్ అవుతుంది. ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, పాపతో పైలం అనే పాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ విడుదల తేదీని వెల్లడిస్తాం ” అని చెప్పుకొచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు