Hyper Aadi : మళ్లీ రాజకీయ హీట్ పెంచుతున్న ఆది… రియాజ్ ను అడ్డుపెట్టుకుని సంచలన కామెంట్స్

Hyper Aadi : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి అయిపోయి కొత్త ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల వేడి మాత్రం ఇంకా పూర్తి స్థాయి తగ్గడం లేదు. కొన్ని కొన్ని చోట్ల ఇంకా చిచ్చు రాజుకుంటూనే ఉంది. ఇక పలువురు సినీ హీరోలు పోటీ చేయడం వల్ల టాలీవుడ్ లో కూడా ఆ ఎన్నికల సెగ బాగానే తాకింది. ఇక ఈ సారి చాలా మంది హీరోలు పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉండగా జబర్దస్త్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని తెలిసిందే. ఈ ఏడాది జనసేన తరపున చాలా రోజులు ప్రచారం కూడా చేసాడు. ఇక ఎన్నికలు అయిపోయి, అంతా చల్లారాక కూడా హైపర్ ఆది మాత్రం ఇంకా తగ్గడం లేదు. అప్పుడప్పుడూ తన సాలిడ్ పంచ్ లతో హైపర్ ఆది రాజకీయ హీట్ ని పెంచుతూనే ఉన్నాడు. తాజాగా మరోసారి హైపర్ ఆది వైసిపి పై సెటైర్లు వేశాడు. ఇదిలా ఉండగా బుల్లితెరపై జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షో లతోనే పొట్టి ‘రింగు రియాజ్‌’ ఫేమస్ అయిన విషయం తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి వెళ్లి రియాజ్ ట్రోలింగ్ బారిన పడ్డాడు. ముందుగా జన సేన కండువా కప్పుకుని, ఆ తరువాత ఎన్నికలకు ముందు వైసీపీ జెండాను ఎత్తుకున్నాడు. చివరకు వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. దీంతో మళ్లీ రింగు రియాజ్‌కు శ్రీదేవీ డ్రామా కంపెనీయే దిక్కైంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన ఓ ప్రోమోలో రింగు రియాజ్ కనిపించాడు.

Hyper Aadi sensational comments on YCP party

హైపర్ ఆది సంచలన కామెంట్స్..

ఇక ఈ షో లో రింగు రియాజ్ ని అడ్డు పెట్టుకుని హైపర్ ఆది (Hyper Aadi) వేసిన సెటైర్లు సంచలనంగా మారాయి. ప్రోమోలో ‘నా రింగు పోయింది’ అని రియాజ్ అంటే.. ‘నీ వల్ల నెల్లూరు మొత్తం పోయింది’.. రింగుది ఏముంది అని కౌంటర్ వేస్తాడు ఆది.. ఆ తర్వాత నాన్న ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది అని రియాజ్ అంటే.. “ఎన్ని 11 మార్కులు వచ్చినయా”? అని ఆది పరువుతీస్తాడు. ఈ ఎన్నికల్లో వైసీపీకి పదకొండు సీట్లే వచ్చాయని హైపర్ ఆది ఇలా కౌంటర్లు వేశాడు. మామూలుగానే సందు దొరికితే ఆది ఇలాంటి పంచులు వేసేందుకు రెడీగా ఉంటాడు. ఇక ఆది వేసిన ఈ పంచ్‌లు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జన సైనికులంతా కూడా ఈ పంచ్‌లను షేర్ చేస్తున్నారు. కౌంటర్లు అదిరిపోయాయ్ అంటూ ఆది వీడియోని షేర్లు చేస్తున్నారు. ఇప్పుడు ట్విట్టర్లో ఆది వేసిన కౌంటర్లే ట్రెండ్ అవుతున్నాయి.

- Advertisement -

నేడే ప్రమాణ స్వీకారం…

ఇక మొన్న జరిగిన ఎన్నికల్లో జనసేన కోసం, పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో ఆది ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. జన సేన వంద శాతం స్ట్రైక్ రేట్‌తో జాతీయ స్థాయిలో చర్చలకు తెరలేపింది. ఇక ఈరోజు (జూన్12) ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా లేదా హోం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. ఇక అలాగే బాలకృష్ణ సహా వివిధ విభాగాల్లో ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తుండగా, ఈ వేడుకకు సినీ ఇండస్ట్రీ నుండి చిరంజీవి, రజినీకాంత్, రామ్ చరణ్ వంటి నటులు గెస్ట్ లుగా విచ్చేయనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు