Bunny Vasu: నేను పవన్ కళ్యాణ్ అంత త్యాగరాజును కాదు – బన్నీ వాసు

Bunny Vasu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనకు తెలియంది కాదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అని అంటే టికెట్లు కోసం నిలబడిన క్యూ రోడ్లపైకి వచ్చేసేది. పోలీస్ డిపార్ట్మెంట్ సైతం జాగ్రత్తలు పాటించమని సూచనలు ఇచ్చేవారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా మారారు. 2014లో జనసేన అనే పార్టీని స్థాపించి అప్పట్లో టిడిపి పార్టీకి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత 2019లో ఓన్ గా పోటీ చేశారు. అప్పుడు పోటీ చేసిన పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓటమి చవిచూశారు. ఇక 2024 ఎలక్షన్లకు సంబంధించి ఎంతటి ఘన విజయాన్ని సాధించారో అందరికీ తెలిసిందే.

ఆయనలా తెగించేంత త్యాగరాజును కాదు

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ లో తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి నిర్మాత బన్నీ వాసుకి మంచి సంబంధం ఉంది. పవన్ కళ్యాణ్ కి పార్టీ పరంగా బన్నీ వాసు చాలా సార్లు సపోర్ట్ చేస్తూ వచ్చారు. అయితే అప్పట్లో బన్నీ వాసుకి జనసేన పార్టీ తరఫున టికెట్ కూడా ఇస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో కూడా వార్తలు గట్టిగా వినిపించాయి. ఇదివరకే ఈ విషయం గురించి చాలాసార్లు క్లారిటీ ఇచ్చాడు బన్నీ వాసు. ఇక రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఇంకొంచెం డీప్ గా చెప్పాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చాలా పెను మార్పులు తీసుకొచ్చారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయటం అనేది మామూలు విషయం కాదు. ఎమ్మెల్యే జనాల దగ్గరికి వెళ్లి అర్జీలు తీసుకునేలా సిస్టం క్రియేట్ చేశాడు ఆయన. ఆయన అన్నీ వదులుకొని రాజకీయాల్లోకి వెళ్లారు. ప్రస్తుతం నాకున్న సినిమాలు వ్యాపారాలు వదులుకొని ఆయనలా తెగించేంత త్యాగరాజును కాదు అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు.

Pawan Kalyan's 'OG'

- Advertisement -

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావని గురించి మాట్లాడుకుంటే, అత్తారింటికి దారేది అనే ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ చూసిన తర్వాత కెరియర్ పీక్లో ఉన్న టైంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అన్నీ కూడా జనాల్లో చాలా ఉత్తేజాన్ని తీసుకొచ్చాయి. తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుంటూ నిలబడ్డాడు. చాలామంది కొన్ని సందర్భాల్లో పార్టీని విలీనం చేసేస్తారు అంటూ విమర్శలు చేసినా కూడా వాటన్నిటిని తిప్పి కొట్టి సక్సెస్ అయ్యాడు పవన్ కళ్యాణ్.

ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాలు విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ దాదాపు నాలుగు ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. వాటిలో చాలామంది ఎంతో ఆసక్తితో ఎదురు చేస్తున్న సినిమాలు ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పాలి. ఇకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఒక పొలిటికల్ పార్టీ ప్రసంగంలో నవ్వుతూ ఓజీ సినిమా బాగుంటుంది చూద్దురుగాను అంటూ చెప్పుకొచ్చాడు. దానితోపాటు ఓజీ సినిమాకి దర్శకుడు సుజిత్ కాబట్టి అందరికీ అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తారు అంటూ అధికారికంగా ప్రకటించారు. అని ప్రస్తుతం ఆ డేట్ కి సినిమా వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు