Tamannaah : అలా చేస్తే విసుగొస్తోంది

అందాల తార తమన్నా భాటియా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తమన్నా సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15 ఏళ్ళు పూర్త‌యిపోయింది. “శ్రీ” సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాతో చక్కటి పేరు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకొని అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.

తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతుంది తమన్నా. తాజాగా f3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ” ఒకే పనిని మళ్లీ మళ్లీ చేస్తే విసుగొస్తోంది. ఓకే తరహా క్యారెక్టర్స్ లో ఎన్నిసార్లని నటిస్తాం. మూస కథల్లో నటించడం నాకే కాదు చూడడానికి ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది.

ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే కాదు నటించేటప్పుడు నాకు సరదా, సంతృప్తి ఉండాలి. అందుకే వీలైనంతవరకు కొత్త తరహా కథలను ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అప్పుడే నన్ను కొత్తగా తెరపై చూడగలుగుతారు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం తమన్నా చేతిలో.. సత్యదేవ్ సరసన నటిస్తున్న “గుర్తుందా శీతాకాలం” , చిరంజీవి “భోళా శంకర్”, హిందీ మూవీ “బోలే చుడియాన్” ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ కూడా వేటికవి విభిన్నమైన పాత్రలని తెలిపింది తమన్నా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు