Ibrahim Ali Khan : రోడ్డుపై పడిపోబోయిన స్టార్ కిడ్… పీకల్లోతు తాగాడు అంటూ ట్రోలింగ్

Ibrahim Ali Khan : కెమెరాల కళ్ళు ఎప్పుడూ స్టార్ కిడ్స్ చుట్టూనే ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే ఇప్పుడు సైఫ్ కొడుకు ట్రోలింగ్ బారిన పడ్డట్టుగా అనవసరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంతకీ సైఫ్ తనయుడు ఏం చేశాడు? అనే వివరాల్లోకి వెళ్తే..

తప్ప తాగి పడిపోబోయాడా ?

బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్, ఆయన మాజీ భార్య అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇబ్రహీం బయటకు వెళుతున్నట్లు కనిపించాడు. అయితే బయటకు వస్తున్నప్పుడు ముందున్న గుంతను చూసుకోకపోవడంతో ఆయన తూలినట్టుగా అయ్యాడు. అయినప్పటికీ ఇబ్రహీం పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. అక్కడ ఉన్న ఫోటో గ్రాఫర్లకు ‘సారీ సారీ’ అని చెప్పి కారు ఎక్కాడు. ఇదంతా వీడియోలో కన్పిస్తోంది. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఇబ్రహీం బాగా తాగినట్టుగా కన్పిస్తున్నాడు.

ఇబ్రహీంపై ట్రోలింగ్

ప్రస్తుతం ఇబ్రహీం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోపై నెటిజన్లు లైక్‌లు, కామెంట్‌లతో సహా ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇబ్రహీం బాగానే ఉన్నాడని ఆశిస్తున్నా…’ అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, ఇబ్రహీం తాగి ఉన్నాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఇబ్రహీం సినిమాల్లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వీడియో సర్వత్రా చర్చనీయాంశమవుతోంది.

- Advertisement -

బాల నటుడిగా అడుగులు

ఇబ్రహీం అలీ ఖాన్ ఇంకా బాలీవుడ్‌లో నటుడిగా అడుగు పెట్టలేదు. అయితే ఇప్పటికీ ఇబ్రహీంకు ఉన్న అభిమానుల సంఖ్య చాలా ఎక్కువ. ఆయన ప్రస్తుతం తెర వెనుక పని చేస్తున్నాడు. ఇబ్రహీం సినిమా కోసం అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అతను బాల నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఇబ్రహీం 2008లో విడుదలైన ‘తాషన్’ చిత్రంలో చిన్నప్పుడే నటించారు. అంతేకాదు గతేడాది విడుదలైన ‘రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ’ సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.

EXCLUSIVE: Ibrahim Ali Khan to start shooting for Karan Johar's next  production from February | PINKVILLA

సోషల్ మీడియాలోనూ యాక్టివ్

ఇబ్రహీం అలీ ఖాన్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇబ్రహీంకు అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. తన అభిమానులతో సన్నిహితంగా ఉండటానికి, ఫాలోవర్స్ ను మరింతగా పెంచుకోవడానికి ఇబ్రహీం తరచుగా సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. దాదాపుగా అతని ప్రతి పోస్ట్ వైరల్ అవుతుండడం విశేషం.

సీనియర్ నటి కూతురితో డేటింగ్

ఇబ్రహీం అలీ ఖాన్ నటి శ్వేతా తివారీ కూతురు, నటి పాలక్ తివారీతో డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా చోట్ల ఇద్దరూ కలిసి కనిపించారు. అంతేకాకుండా ఇబ్రహీం ఓసారి తమను చుట్టు ముట్టిన గుంపులో ఇబ్బంది పడుతున్న పాలక్‌ను జాగ్రత్తగా చూసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు తమ రిలేషన్ షిప్ గురించి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఎప్పటికప్పుడు వెళ్ళిద్దరి గురించి పుకార్లు మాత్రం షికార్లు చేస్తూనే ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు