IC814 : బాయ్ కాట్ ట్రెండ్ ఎఫెక్ట్… ఐసి814 సిరీస్ విషయంలో నెట్ ఫ్లిక్స్ కీలక నిర్ణయం

IC814 : కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకు IC814: ది కాందహార్ హైజాక్ అనే వెబ్ సిరీస్‌లో చిత్రీకరించబడిన ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాల హైజాకర్ల నిజమైన, కోడ్ పేర్లను చేర్చినట్లు నెట్‌ఫ్లిక్స్ ఇండియా మంగళవారం తెలిపింది. హైజాకర్ల వాస్తవ గుర్తింపులను వక్రీకరించడం చారిత్రక సంఘటనలను తప్పుగా చూపించడమేనని వాదిస్తూ, ఉగ్రవాదులను మానవీయంగా ప్రదర్శించడం, వారి హిందూ కోడ్ పేర్లను సూచించడంపై ప్రేక్షకుల్లో ఒక వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఈ వెబ్ సిరీస్‌ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం.

నెట్ ఫ్లిక్స్ పై కేంద్రం ఫైర్

IC814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్‌లోని కొన్ని అంశాల వర్ణనపై కేంద్రం తీవ్ర అసంతృప్తిని తెలియజేయడానికి సమాచార, ప్రసార కార్యదర్శి సంజయ్ జాజు నెట్‌ఫ్లిక్స్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్‌ను పిలిపించారు. మొత్తానికి సమావేశం తరువాత మోనికా ఇకపై తమ కంటెంట్ లో ఇండియన్ ప్రేక్షకుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 814 హైజాకర్ల పేర్లను, డిస్క్లైమర్ ను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

హైజాకర్ల అసలు పేర్లు ఇబ్రహీం అథర్, షాహిద్ అక్తర్ సయ్యద్, సన్నీ, అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్. అయితే ఈ సిరీస్‌లో ఉగ్రవాదులు ఉపయోగించే కోడ్ పేర్లు భోలా, శంకర్, డాక్టర్, బర్గర్, చీఫ్. కానీ ఉగ్రవాదులను రక్షించడానికే నెట్ ఫ్లిక్స్ ఇలా హిందువుల పేర్లను వాదిందనే విమర్శలు విన్పించాయి.

- Advertisement -

అసలు వివాదం ఏంటంటే?

1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ IC 814ను పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ హర్కత్-ఉల్-ముజాహిదీన్ చేసిన హైజాక్ ఆధారంగా రూపొందించిన ఈ సిరీస్ లో ఇద్దరు హైజాకర్లకు ‘భోలా’ మరియు ‘శంకర్’ అనే కోడ్ నేమ్‌లుగా ఉపయోగించడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే 2000లో హోం మంత్రిత్వ శాఖ ప్రకటనలో ఇవి నిజంగా ఇద్దరు హైజాకర్లు ఉపయోగించిన కోడ్ పేర్లు అని చూపిస్తుంది.

IC 814- The Kandahar Hijack Row: What Netflix India Content Head Told I&B  Ministry | Inside Scoop | Times Now

‘IC-814’ రో అంటే ఏమిటి?

#BoycottNetflix, #BoycottBollywood #IC814 అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి, సోషల్ మీడియా వినియోగదారులలో ఒక వర్గం నేరస్థుల “మానవత్వం” గురించి కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకుంది. మేము కంటెంట్, కంటెంట్ సృష్టికర్తలకు మద్దతు ఇస్తున్నాము. కానీ వాస్తవాలను వక్రీకరించడం సాధ్యం కాదు. సృజనాత్మకత కింద మనోభావాలను దెబ్బతీయకూడదు,” అని ప్రభుత్వం నెట్‌ఫ్లిక్స్ కంటెంట్ హెడ్‌కి వివరించింది.

దర్శకుడు అనుభవ్ సిన్హా పాక్ ఉగ్రవాదులకు హిందూ పేర్లు పెట్టి వారి నేరాలను వైట్ వాష్ చేశారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. దీంతో ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. “చిత్రనిర్మాత అనుభవ్ సిన్హా ముస్లిమేతర పేర్లను మార్చి ద్వారా వారి నేర ఉద్దేశాన్ని చట్టబద్ధం చేశారు. దశాబ్దాల తరువాత హిందువులు IC-814ను హైజాక్ చేశారని ప్రజలు అనుకుంటారు” అని మాల్వియా ట్వీట్ చేశారు.

1999న డిసెంబరు 24న 176 మంది ప్రయాణికులతో ఖాట్మండు నుండి ఢిల్లీకి వెళ్లే IC 814 విమానం హైజాక్ అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని కాందహార్‌లో ల్యాండింగ్ చేయడానికి ముందు అనేక ప్రదేశాలకు తరలించబడింది. ఏడు రోజుల తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ప్రభుత్వం హైజాకర్ల డిమాండ్‌లను పాక్షికంగా అంగీకరించడంతో హైజాక్ ముగిసింది. ప్రయాణీకులకు బదులుగా ముగ్గురు భయంకరమైన ఉగ్రవాదులు మౌలానా మసూద్ అజర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్‌లను విడుదల చేశారు. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడు మృతి చెందాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు