Dhanush : రాయన్ గా తాను చేయకుండా ఉంటే ఆయన్నే హీరోగా పెట్టేవాడట!

Dhanush : కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన తాజా చిత్రం “రాయన్”. ఈ సినిమాలో ధనుష్ నటించడమే కాకుండా స్వీయ దర్శకత్వం వహించాడు. కాగా ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటినుండి ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోగా, ట్రైలర్, సాంగ్స్ కూడా మెప్పించాయి. ఈ సినిమాలో ధనుష్ ఒక మెకానిక్ గా నటిస్తుండగా, ఈ సినిమా తన 50వ సినిమాగా తెరకెక్కడం జరిగింది. ఇదిలా ఉండగా రాయన్ ప్రీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ తాజాగా హైదరాబాద్ లో జరగగా, ఇక ఈ సినిమా ఈవెంట్ కి ధనుష్ సహా చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు వంటి నిర్మాతలు అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ధనుష్ తో పాటు సందీప్ కిషన్, దిల్ రాజు స్పీచ్ లు వైరల్ గా మారాయి.

If Dhanush didn't do the role of Raayan, he would have done it with Rajinikanth

తాను రాయన్ కాకపోతే ఆయనతోనే చేసేవాడట..

ఇక రాయన్ సినిమాలో టైటిల్ రోల్ ని ధనుష్ (Dhanush) పోషించగా, ధనుష్ ప్రీ రిలీజ్ వేదికపై ఆసక్తికర విషయాల్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో నటించిన కాళిదాస్ ధనుష్ ని అడుగుతూ, రాయన్ లో మీరు యాక్ట్ చేయకుండా కేవలం దర్శకత్వం మాత్రమే చేస్తే, హీరోగా ఎవరితో చేసేవారని అడగగా… దానికి ధనుష్ సమాధానమిస్తూ తాను దర్శకత్వం మాత్రమే చేస్తే.. రాయన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ తో చేసేవాడినని ధనుష్ చెప్పుకొచ్చాడు. ఈ మాట విన్న వెంటనే స్టేజి హోరెత్తిపోయింది. అయితే సందీప్ కిషన్ స్పీచ్ లో మాత్రం ఈ సినిమాలో తాను చేసిన పాత్రను కూడా ధనుష్ తనకోసమే రాసుకుని, ఆ పాత్ర తనకి ఇచ్చాడని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

జులై 26న రిలీజ్ కి రెడీ..

ఇక రాయన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ కిషన్, దిల్ రాజు, ప్రకాష్ రాజ్ స్పీచ్ లు కూడా బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఈవెంట్ లోనే దిల్ రాజు గేమ్ ఛేంజర్ రిలీజ్ అప్డేట్ కూడా చెప్పేసాడు. ఇక ఈ సినిమాలో విలక్షణ దర్శక నటులు ఎస్.జె. సూర్య, సెల్వ రాఘవన్ కూడా కీలక పాత్రల్లో నటించగా, సందీప్ కిషన్, కాళిదాస్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, దుషార విజయన్ కీలక పాత్రల్లో నటించారు. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో జూలై 26, 2024 న మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు