Pawan kalyan: పవన్ కళ్యాణ్ కి పూల బాట వేస్తే దాని మీద నడవకుండా పక్క నుండి వెళ్ళిపోయాడు, ఇది అసలు కారణం.?

Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ ది ఒక సినిమా డిజాస్టర్ అయినా కూడా ఆ సినిమాకి మినిమం కలెక్షన్స్ వస్తాయి. ఇండియా మొత్తంలో వరుస గా సినిమాలు డిజాస్టర్ ల అయినా కూడా రెమ్యూనరేషన్ పెరిగి ఫ్యాన్ బేస్ పెరిగిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్. ఇకపోతే ఒకవైపు సినిమాల్లోనూ మరోవైపు రాజకీయాల్లోనూ మంచి బిజీగా కాలాన్ని గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. 2014లో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ 2019లో పోటీకి దిగి రెండు చోట్ల ఓడిపోయారు.

2019లో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత ఆయన పైన చాలా వ్యక్తిగత విమర్శలు మొదలయ్యాయి. అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్సిపి వ్యక్తిగత విషయాలను కూడా టార్గెట్ చేసి మాట్లాడటం మొదలు పెట్టింది. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లు తగ్గించడం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను థియేటర్ వద్దకు కాపలాకు పంపించడం ఇవన్నీ జరిగాయి. అయితే 2024 లో పవన్ కళ్యాణ్ తన పార్టీ తరపున పోటీ చేసిన 21 అభ్యర్థుల్ని గెలిపించుకోగలిగాడు. అలానే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలుపొందాడు.

Pawan Kalyan

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొందిన తర్వాత డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపట్టారు. అయితే నేడు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి విచ్చేశారు. అయితే పిఠాపురంలో నియోజకవర్గంలో ని పవన్ కళ్యాణ్ కి పూలబాటతో స్వాగతం పలికారు. అయితే పవన్ కళ్యాణ్ కి పూలబాటు వేసినా కూడా పూలు పై నడవకుండా పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్.

ఇక పవన్ కళ్యాణ్ ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా టైంలో కూడా ఇలానే జరిగింది. గబ్బర్ సింగ్ సినిమాలో ఒక ప్లేట్ విసిరినప్పుడు గులాబీ రెక్కలు కింద పడతాయి. అయితే ఆ సీన్ ను రెండు టేకులు చేసిన తర్వాత, ఆ గులాబీ రెక్కలన్నీ సెట్ డిపార్ట్మెంట్ ఏరిన తర్వాత సెట్ లోకి వచ్చారట పవన్ కళ్యాణ్. అంటే పువ్వులని తొక్కకూడదు, నేచర్ ని ప్రేమించాలి అని కళ్యాణ్ గారి ఉద్దేశం అంటూ హరీష్ శంకర్ ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు