Saripodha Saninvaram: ఎస్ జె సూర్య ను ఇంటర్వ్యూకి పిలిస్తే సినిమా కథ చెప్పేసాడు

Saripodha Saninvaram: ఎస్ జె సూర్య.. సినిమాలను ఎక్కువగా చూసే సినిమా ప్రేమికులకు ఈ పేరు గురించి ఈ వ్యక్తి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నటుడుగా కంటే ముందు దర్శకుడిగా తనకంటూ మంచి పేరుని సాధించుకున్నాడు ఎస్ జె సూర్య. చాలామంది పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలుగు ప్రేక్షకులకు ఎస్. జె సూర్య అనగానే గుర్తొచ్చే సినిమా ఖుషి. పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఈ సినిమా పవన్ కెరియర్ లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్లు పవన్ కళ్యాణ్ కి ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. ఈ సినిమాకి ఎస్ జె సూర్య దర్శకత్వం వహించాడు.

ఈ సినిమా తర్వాత మహేష్ బాబుతో తెలుగులో నాని సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ సినిమా కూడా ఒక ఎక్స్పరిమెంటల్ ఫిలిం అనిపించుకుంది గాని ఊహించిన స్థాయిలో ఆడలేదు. మరోసారి పవన్ కళ్యాణ్ తో కొమరం పులి అని ఒక పోలీస్ బ్యాక్ డ్రాప్ స్టోరీని ట్రై చేశాడు. ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇక రీసెంట్గా ఎస్ జె సూర్య నటుడిగా విపరీతమైన గుర్తింపును సాధించుకుంటున్నాడు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏఆర్ మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమాలో విలన్ లా కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

Saripodhaa Sanivaaram

- Advertisement -

స్టాలిన్ సినిమా తర్వాత దాదాపు కొన్ని ఏళ్లపాటు గ్యాప్ తీసుకొని తెలుగులో మహేష్ బాబుతో స్పైడర్ అనే సినిమాను తెరకెక్కించాడు మురుగదాస్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో భైరవుడు అనే ఒక పాత్రలో కనిపించాడు సూర్య. సూర్య చేసిన ఈ పాత్ర విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చింది. ఇప్పటికీ భైరవుడు మీమ్స్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంటాయి. ప్రస్తుతం ఎస్ జె సూర్య విలన్ గా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమాలో కూడా విలన్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ తరుణంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో ఎస్ జె సూర్య మాట్లాడుతూ ఈ సినిమాలో క్యారెక్టర్ కి ఎక్కువగా కోపం ఉంటుంది అయితే ఆ కోపాన్ని కేవలం శనివారం మాత్రమే చూపించమని వాళ్ళ మదర్ ఆ పిల్లోడితో చెబుతుంది. ఆ పిల్లోడు కోపాన్ని అంతటినీ కేవలం శనివారం మాత్రమే చూపిస్తాడు అంటూ స్టోరీ లైన్ ని చెప్పేసాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు