IIFA Awards 2024: అవార్డ్స్ పండుగ.. ఎప్పుడు, ఎక్కడంటే..?

IIFA Awards 2024: ఈ ఏడాది జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ పురస్కారాల కోసం సినిమా ప్రేమికులు ఎంతో మంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి అబుదాబి ఈ వేడుకకు వేదిక కానుంది. 24వ ఐఫా వేడుకలు అబుదాబిలోని ఐల్యాండ్ లో సెప్టెంబర్ 27 నుండీ 29 వరకు జరగబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ అవార్డులతో పాటు సినీ సెలబ్రిటీలతో సందడిగా సాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ తో పాటు ప్రముఖ బాలీవుడ్ నిర్మాత నటుడు కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీని గురించి నిర్వహలు కూడా ప్రకటించేశారు. దీంతో ఈ వేడుకపై అందరూ ఆసక్తి పెంచుకున్నారు. ముఖ్యంగా వీరు హోస్టింగ్ కే కాదు కామెడీ టైమింగ్ కి కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అలా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ ఐఫా వేడుకల్లో బాలీవుడ్ స్టార్స్ హోస్టింగ్ అంటే అంచనాలు పీక్స్ కి వెళ్ళిపోయాయి. అంతేకాదు ఈ వేడుకలలో షాహిద్ కపూర్ తో పాటు కలిసి ప్రముఖులు తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను కూడా అలరించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ కోసం అభిమానులు ఎంతో ఎదురు చూస్తున్నారు. దాదాపు మూడు రోజులపాటు జరగనున్న ఈ వేడుక సెప్టెంబర్ 27న మొదలు కాబోతోంది. 29న ఐఫా రాక్స్ గాలా తో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది.

IIFA Awards 2024: Awards festival.. when and where..?
IIFA Awards 2024: Awards festival.. when and where..?

ఐఫా లో పోటీ పడబోతున్న ఐదు చిత్రాలు..

ఇకపోతే ఈ సంవత్సరం నామినేషన్లలో ఎవరెవరు ఉండబోతున్నారు అనే విషయం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక అందులో భాగంగానే నామినేషన్లలో ముఖ్యంగా బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా చాలా సినిమాలు పోటీ పడబోతున్నాయి. ఇకపోతే బాలీవుడ్లో రణబీర్ కపూర్ యానిమల్ చిత్రం అత్యధికంగా 11 నామినేషన్స్ దక్కించుకుంది. అంతేకాదు తెలుగులో ఈ మధ్యనే జరిగిన అసలైన ఫిలింఫేర్ అవార్డులలో లాగానే ఐఫా లో కూడా నాని సినిమాలు మిగతా సినిమాలను కూడా డామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాని దసరా, హాయ్ నాన్న సినిమాలు కూడా అత్యధికంగా నామినేషన్లలో నిలువలున్నాయి. నాని దసరా సినిమాకి 10 నామినేషన్లు లభించగా , హాయ్ నాన్న చిత్రానికి ఆరు నామినేషన్లు వచ్చాయి. అలాగే భగవంత్ కేసరి , బేబీ సినిమాలకు చెరో నాలుగు నామినేషన్లు రావడం జరిగింది. ఇక ప్రభాస్ సినిమాకి మూడు నామినేషన్లు లభించాయి.

బెస్ట్ క్యాటగిరీలో తెలుగులో ఐదు చిత్రాలు..

ఇకపోతే తాజాగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్ని చిత్రాలు ఉన్నా ఈ ఐదు సినిమాలు బెస్ట్ సినిమా అవార్డుకి నామినేట్ అవ్వడం గమనార్హం. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలు , నామినేషన్స్ కి రెండు సినిమాలతో కూడా నాని సెలెక్ట్ అయ్యారు. అటు సినిమా మాత్రమే కాకుండా బెస్ట్ నటీనటుల అవార్డుల గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఐఫా అవార్డ్స్ కోసం గట్టి పోటీ ఉంటుందని నామినేషన్లను చూస్తేనే మనకు తెలుస్తోంది. మరి ఎవరు ఈ ఐఫా అవార్డులను సొంతం చేసుకుంటారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు