Iifa utsavam -2024: ప్రతిష్టాత్మక అవార్డు అందుకోనున్న సమంత.. !

Iifa utsavam – 2024: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఐఫా ఉత్సవంలో పాల్గొనబోతోంది. ఈ అవార్డుల ఉత్సవం సెప్టెంబర్ 6 , 7వ తేదీలలో చాలా ఘనంగా జరగనున్న నేపథ్యంలో ఈ వేడుకలలో సమంత అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని అందుకోనున్నట్లు సమాచారం.” ఉమెన్ ఆఫ్ ది ఇయర్” గా సమంత అవార్డు తీసుకోబోతోంది. అబుదాబి లోని యాస్ ఐలాండ్ లో జరగబోతున్న ఈ ఐఫా ఉత్సవం 2024లో సమంత ఈ అవార్డును దక్కించుకుంటుందని తెలుస్తోంది. తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సమంత సూపర్ హిట్ సినిమాలలో నటించింది.

Iifa utsavam-2024: Samantha to receive the prestigious award.. !
Iifa utsavam-2024: Samantha to receive the prestigious award.. !

సమంత ఒక పవర్ హౌస్.. ప్రతిష్టాత్మక అవార్డు..

దీంతో సమంతాను ఒక పవర్ హౌస్ అని చాలామంది ప్రశంసించారు కూడా.. అంతేకాదు కోలీవుడ్ లో కూడా సత్తా చాటింది ఈ ముద్దుగుమ్మ..అక్కడ కూడా స్టార్ హీరోల సరసన నటించి సూపర్ హిట్ విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఒక తెలుగు, తమిళ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా సత్తా చాటుతూ మరొకసారి అందరి దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో ప్రేక్షక ఆధారాభిమానాలు పొందిన ఈమె.. నటిగానే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటుంది. అందుకే ఈ ఏడాది ఐఫా ఉత్సవం ఈమెను ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది ప్రస్తుతం అవార్డు అందుకోవడానికి సిద్ధమయింది సమంత.. ఈ విషయం తెలిసి అభిమానులు , సెలబ్రిటీలు సమంతకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సమంత సినీ కెరియర్..

ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు తన అందచందాలతో నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఉండే స్టార్ హీరోలు అందరితో కూడా కలిసి నటించిన సమంత తన అద్భుతమైన నటనతో తెలుగు ఆడియన్స్ హృదయాలలో చోటు దక్కించుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సమంత కెరీర్ కు ఒక మైల్ స్టోన్ గా నిలిచిందని చెప్పాలి. ఈ సినిమాలో నటించిన నాగచైతన్య తో ఈమె ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఇక వివాహమైన నాలుగేళ్లకే విడిపోయి వార్తల్లో నిలిచింది.

- Advertisement -

హీరోయిన్ మాత్రమే కాదు నిర్మాత కూడా..

ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్న ఈమె అదే సమయంలో మయోసైటీస్ బారిన పడడం దాని నుంచి కోలుకోవడానికి చికిత్స తీసుకోవడం లాంటివి కూడా జరిగిపోయాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు మానసికంగా మరింత బలంగా మారడం కోసం ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ కూడా తీసుకొని.. ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో అలరించడానికి సిద్ధం అయ్యింది. ఇక అందులో భాగంగానే నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసింది సమంత. తన నిర్మాణ సంస్థ ద్వారా మా ఇంటి బంగారం అనే సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటించడమే కాదు నిర్మిస్తూ తన టాలెంట్ ను నిరూపించుకుంటుంది సమంత. ఇక అలాగే ప్రస్తుతం తాను నటించినా సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కి సిద్ధం కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు